
Samantha Health : హీరోయిన్ సమంత సడన్ గా అనారోగ్యం బారినపడ్డారు. ఈ విషయం తెలియజేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ క్రమంలో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సమంతకు మాయోసైటిస్ సోకిన విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ లో సమంత షాకింగ్ మేటర్ బయటపెట్టారు. దీంతో యశోద చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కావడంతో సమంత ఒక ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చారు.
అనారోగ్యం నేపథ్యంలో చికిత్స తీసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఆమె షూటింగ్స్ లో పాల్గొనలేదు. రెండు నెలలుగా సమంత బయట కనిపిస్తున్నారు. తిరిగి షూటింగ్స్ లో బిజీ అయ్యారు. అయితే ఆమె పూర్తిగా కోలుకోలేదు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నట్లు చెప్పారు. తన కళ్ళు కాంతిని తట్టుకోలేకపోతున్నాయి. అందుకే నేను కళ్ళజోడు పెట్టుకున్నానని వెల్లడించారు. ఇక శాకుంతలం చిత్రానికి సమంతనే ప్రధాన అట్రాక్షన్. ఆమె బ్రాండ్ నేమ్ ఆధారంగానే సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రావాలి.
ఈ క్రమంలో సమంత శాకుంతలం ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొన్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలుమార్లు ముంబై వెళ్లి మీడియాతో ముచ్చటించారు. వరుస షెడ్యూల్స్ నేపథ్యంలో ఆమె అనారోగ్యం బారినపడ్డారట. ఈ విషయం తెలియజేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. హెల్త్ రీజన్స్ తో శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్నానని ఒకింత ఆవేదన చెందారు.
ఏప్రిల్ 14న శాకుంతలం విడుదల కానుంది. ఇది పౌరాణిక గాథ. విశ్వామిత్ర మహర్షి శకుంతల కథే శాకుంతలం. సమంత టైటిల్ రోల్ చేస్తున్నారు. మలయాళ నటుడు మోహన్ దేవ్ సమంతకు జంటగా నటిస్తున్నారు. మోహన్ బాబు ఓ కీలక రోల్ లో అలరించనున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు సమంత ఖుషి చిత్ర షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు.
https://twitter.com/Samanthaprabhu2/status/1646075728449146882