
Ravi Teja : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరో గా ఎదిగిన వారిలో ఒకరు మాస్ మహారాజ రవితేజ.అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత హీరో గా మారి,హిట్టు మీద హిట్టు కొడుతూ తనకంటూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇప్పటికీ కూడా ఆయన వరుసగా సూపర్ హిట్స్ కొడుతూ స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.
రీసెంట్ గానే ధమాకా మరియు వాల్తేరు వీరయ్య వంటి వరుస హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ ఇప్పుడు ‘రావణాసుర’ సినిమాతో ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు.ఈ సినిమా లో కేవలం ఆయన హీరో మాత్రమే కాదు,నిర్మాతగా కూడా వ్యవహరించాడు.ఆయనకీ ఉన్న మాస్ ఇమేజి కారణంగా ఓపెనింగ్స్ అదిరిపోయినా ఫుల్ రన్ లో మాత్రం సుమారుగా 10 కోట్లకు పైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
సినిమాకి ఫ్లాప్ అయితే లేదు కానీ, డివైడ్ టాక్ మాత్రం ఉంది.కొంతమంది బాగుంది అంటుంటే మరికొంతమంది బాగాలేదు అని అంటున్నారు.హీరో క్యారక్టర్ ఇందులో పూర్తిగా నెగటివ్ అవ్వడం వల్లే ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్ కి కదలడం లేదని అంటున్నారు విశ్లేషకులు.కేవలం ఈ సినిమాకి మాత్రమే కాదు, గతం లో ఆయన హీరో గా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి కూడా రవితేజ నిర్మాతగా వ్యవహరించాడు.ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.కలెక్షన్స్ 5 కోట్ల రూపాయిల కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి.ఈ సినిమాకి నిర్మాతగా రవితేజ చాలా నష్టపోయాడు.
ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ హీరో విష్ణు విశాల్ సినిమాలని తెలుగులో డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసి ఇక్కడ విడుదల చేసాడు.కనీసం ప్రింట్ ఖర్చులకు అయ్యే వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.అలా రవితేజ హీరో గా చేసిన సంపాదించుకున్న డబ్బులు మొత్తం ఇప్పుడు చెత్త సినిమాలను చేసి పోగొట్టుకుంటున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలలో నిర్మాతగా సుమారు 30 కోట్ల రూపాయిల వరకు నష్టపోయాడనే తెలుస్తుంది.రవితేజ హీరో గా ఒక్కో సినిమాకు ప్రస్తుతం 15 కోట్ల రూపాయిల వరకు తీసుకుంటున్నాడు.ఆయన అలాగే కొనసాగితే బాగుంటుందని,ఇలా పస లేని స్టోరీలను ఎంచుకొని కోట్ల రూపాయిలు అనవసరం గా నష్టపోవడం వల్ల సమయం వృథా తప్ప మరొకటి లేదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.