Naresh and Pavitra Lokesh Issue: సినిమా పరిశ్రమలో ఎప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పుడు సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం పరిశ్రమలో పలు చర్చలకు దారి తీస్తోంది. వారి సహజీవనంపై విభిన్న కథనాలు వస్తున్నాయి. పవిత్ర లోకేష్ తన భార్య అని కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ చెబుతుంటే అసలు ఆయనను తాను పెళ్లి చేసుకోలేదని పవిత్ర చెబుతోంది. దీంతో ఈ వ్యవహారం ఎక్కడికో వెళ్లనుంది. దీనిపై సర్వత్రా చర్చలు సాగుతున్నాయి. నరేష్ మూడో భార్య రమ్య వీరి బాగోతాన్ని రచ్చకీడ్చినట్లు తెలుస్తోంది.

నరేష్ అంటే ఎవరో తనకు తెలియదని తన భార్య పవిత్ర అని సుచేంద్ర ప్రసాద్ ప్రకటిస్తున్నాడు. ఆవిడే తన భార్య అని చెప్పడానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నాడు. ఆధార్, పాస్ పోర్టు తదితర వాటిపై తమ పేర్లు నమోదై ఉన్నాయని పేర్కొన్నాడు. అంతే కాదు తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపాడు. దీంతో నరేష్ పవిత్రల వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తోంది. అసలు ఇందులో నిజమెంత? అబద్దమెంతో అర్థం కాకుండా ఉంది. కానీ నరేష్, పవిత్ర మాత్రం సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Vikram Collections: కమల్ ‘విక్రమ్’కి తెలుగులో ఎన్ని కోట్లు లాభమో తెలుసా ?
నరేష్, పవిత్ర ఓ హోటల్ లో ఉండగా నరేష్ మూడో భార్య రమ్య వీరిని పట్టుకుందని వార్తలు వస్తున్నాయి. దీంతోనే వీరి గుట్టు రట్టు అయినట్లు చెబుతున్నారు. కొద్ది రోజులుగా వీరి కలయికపై రకరకాల వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె వీరిని పట్టివ్వాలనే ఉద్దేశంతో ఇంత కాలం ఆగినట్లు తెలిసింది. దీంతో వీరు కలిసి ఉంటున్న సంగతి దావానంలా వ్యాపించడంతో వీరి కదలికలపై కన్ను వేసినట్లు తెలుస్తోంది.

ఇక వారు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో పవిత్ర ఏం సమాధానం చెబుతుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆమె భర్తనంటూ కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ చెబుతుండటం అందరిలో ఆతృత పెంచుతోంది. పవిత్ర మాత్రం అతడితో సహజీవనం మాత్రమే చేశానని వివాహం చేసుకోలేదని బుకాయిస్తోంది. అతడేమో తన వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రకటించడంతో వీరి కథ ఎందాకా వెళ్తుందో తెలియడం లేదు. వీరి కథ సుఖాంతమవుతుందా? లేక మలుపులు తిరుగుతుందా అనేదానిపైనే చర్చలు సాగుతున్నాయి. మొత్తానికి పరిశ్రమలో మరో వివాదం హల్ చల్ చేస్తోంది. నరేష్, పవిత్రల సంబంధం అందరిలో ఆలోచనలు రేపుతోంది.
Also Read:RRR New Poster Viral: ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ వైరల్.. ఎన్టీఆర్ – చరణ్ మధ్యలో రాజమౌళి
[…] Also Read: Naresh and Pavitra Lokesh Issue: పవిత్ర నా భార్య.. నరేష్ కు … […]