Pavitra Lokesh: సీనియర్ నటుడు నరేష్ ప్రేమ వ్యవహారం మరీ కామెడీగా ఉంది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ఆయన గారు మళ్లీ ప్రేమలో పడ్డారు. పైగా ఇద్దరు పిల్లలు, ఇద్దరు భర్తలు ఉన్న పవిత్ర లోకేష్ గారిని ఆయన ప్రేమించారు. ఇది నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి నచ్చలేదు. దాంతో వివాదం మొదలైంది. పైగా ఈ వివాదం రోజురోజుకూ మరింత ముదిరింది. ఇంకా ముదురుతూనే ఉంది. ఈ క్రమంలోనే రమ్య ..మైసూర్‌లోని ఓ హోటల్‌లో నరేశ్-పవిత్రా లోకేశ్ కలిసి వున్నారనే సమాచారం తెలుసుకుంది.

senior hero Naresh, Pavitra Lokesh
రమ్య వెంటనే అక్కడికి మీడియాని వెంటబెట్టుకొని వెళ్ళి.. నరేష్- పవిత్ర లోకేష్ లను మీడియా ముందు నిలబెట్టింది. తనకు ఇంకా విడాకులివ్వకుండా మరో మహిళని ఎలా పెళ్లి చేసుకుంటారంటూ రమ్య గొడవ చేసింది. కానీ నరేష్ మాత్రం ఆమె మాటలు విని ఉత్సాహంగా ఎగురుకుంటూ వెళ్ళాడు. నరేష్ వెనుకే.. అమాయకపు మొహంతో పవిత్ర లోకేష్ కూడా జారుకుంది. కానీ.. పవిత్ర లోకేష్ కే ఇక్కడ ఎక్కువ నష్టం.
Also Read: Naresh and Pavitra Lokesh Issue: పవిత్ర నా భార్య.. నరేష్ కు షాకిచ్చిన ఆమె భర్త
పవిత్ర లోకేష్ తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలకు మదర్ గా నటిస్తున్నారు. ఈ పాత్రల్లో ఆమె ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నారు. పెద్ద సినిమాల్లో దాదాపు తల్లి పాత్రలన్నీ ఆమె దగ్గరకే వెళ్తున్నాయి. కారణం ఆమెకు మంచి హోమ్లీ ఇమేజ్ ఉంది. కానీ.. నరేష్ తో ఘాటు ప్రేమ వ్యవహారం.. ఆమె హోమ్లీ ఇమేజ్ పై ఎఫెక్ట్ చూపించేలా ఉంది. ఇప్పటికే పవిత్ర లోకేష్ ఇమేజ్ మీద ఈ వివాదం బాగా దెబ్బ కొట్టింది.

Pavitra Lokesh
ముఖ్యంగా ‘హోటల్ గదిలో ఆమె నరేష్ తో అడ్డంగా దొరికిపోవడం కచ్చితంగా ఆమె కెరీర్ కి లాసే. అసలు ఒక నటికి ఇంతకంటే దారుణమైన డ్యామేజీ ఏమి ఉంటుంది ? మొత్తానికి ఈ గొడవల కారణంగా పవిత్ర లోకేష్ కి ఛాన్స్ లు కూడా తగ్గే అవకాశం ఉంది. అయినా ‘పవిత్రా లోకేష్’ కెరీర్ మొదటి నుంచి ఇలాగే పడుతూ లేస్తూ ఉంది. మొదట్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. ఆ తర్వాత ఆ అవకాశాలను అందుకోలేకపోయింది.

Pavitra Lokesh
మధ్యలో హాట్ హాట్ రోల్స్ ను ట్రై చేసినా అప్పట్లో పవిత్రను పెద్దగా ఎవ్వరూ గుర్తించలేదు. కానీ, అదృష్టం బాగుండి.. మొత్తానికి తల్లి పాత్రలకు ప్రధాన ఆప్షన్ గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఆమె ఎక్కువగా హీరోకో, హీరోయిన్ కో తల్లిగా దర్శనమిస్తూ మంచి ఇమేజ్ ను సంపాధించింది. కానీ తెరపై పద్దతిగా, సంప్రదాయంగా కనిపించే పవిత్ర లోకేష్.. నిజ జీవితంలో మాత్రం బోల్డ్ బోల్డ్ నెస్ తో రెచ్చిపోతుంది.
Also Read:Save AP: అదొక్కటే ఏపీని కాపాడగలదు: పవన్ కల్యాణ్