Su From So OTT Release: కన్నడ సినీ ఇండస్ట్రీ లో కూడా ఈ ఏడాది చిన్న సినిమాల హవానే ఎక్కువగా నడిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా విడుదలైన ‘మహావతార్ నరసింహా’ అనే చిత్రం 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటుంది. ఆ సినిమా విడుదలైన కొద్దిరోజుల తర్వాత కన్నడ లో ‘సు ఫ్రొం సో'(Su From So) అనే మరో చిన్న చిత్రం విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిన్న చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కన్నడ లో పెద్ద హిట్ అవ్వడంతో తెలుగు లో కూడా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ డబ్ చేసి విడుదల చేశారు. ఇక్కడ కూడా రెస్పాన్స్ అదిరిపోయింది, కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది.
ఈ చిత్రం ద్వారా మొట్టమొదటి సార్ జేపీ తుమినాద్ రచన, దర్శకత్వం చేయడం తో పాటు,ఒక కీలక పాత్ర కూడా పోషించాడు. ప్రముఖ నటుడు రాజ్ బీ శేట్టియు ఇందులో ప్రధాన పాత్రలో కనిపించడమే కాకుండా, ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. థియేటర్స్ లో రన్ ని దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 5వ తారీఖు నుండి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓటీటీ ఆడియన్స్ ని ఎంత మేరకు అలరిస్తుందో చూడాలి. ప్రారంభం నుండి చివరి వరకు పొట్ట చెక్కలు అయ్యే కామెడీ తో మీ కళ్ళలో నుండి నీళ్లు వచ్చేస్తాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయ్యో థియేటర్స్ లో ఈ సినిమాని మిస్ అయ్యామే అని బాధ పడేవారు సెప్టెంబర్ 5 కోసం వేచి ఉండండి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే కర్ణాటకలోని ఒక మారుమూల పల్లెటూరు రవన్న అనే మధ్య వయస్కుడు ఊరి పెద్దగా వ్యవహరిస్తూ, ప్రతీ ఒక్కరి కష్టసుఖాల్లో పాలుపంచుకంటూ ఉంటాడు. మరోవైపు అశోక్ అనే వ్యక్తి ఒక అమ్మాయి ని గాఢంగా ప్రేమించి, ఒక రోజు తన ప్రేమ విషయాన్నీ తెలియజేయడానికి ఆ అమ్మాయి ఇంట్లోకి దూరుతాడు. ఇంట్లో ఎవ్వరూ ఉండరు, కానీ బాత్రూం లో ఆ ఇంట్లో ఉండే వృద్ధురాలు స్నానం చేస్తూ ఉంటుంది. ఈ విషయం తెలియని అశోక్, లోపల స్నానం చేస్తున్నది తాను ప్రేమించిన అమ్మాయే అని అనుకోని బాత్రూం లోకి తొంగిచూస్తాడు. దీంతో ఆ వృద్ధురాలు గట్టిగా అరిచేస్తుంది, ఊరంతా ఈ విషయం ప్రచార అవ్వడం తో పెద్ద సమస్యగా మారుతుంది. దీంతో నీనిని డైవర్ట్ చేయడానికి తనకు సులోచన అనే దెయ్యం ఆవహించినట్టు నటిస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే ఆసక్తికరంగా, చాలా ఫన్నీ గా ఉంటుంది.