
బాలీవుడ్ లో కష్టపడి పైకి వచ్చే హీరోలకు జీవితాలు ఉండవా ? ఇప్పుడంతా బాలీవుడ్ లో అవుట్ సైడర్స్ అనే మాట ఎక్కువుగా వినిపిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో మొదలైన బాలీవుడ్ బంధుప్రీతి ఆధిపత్యం పై మళ్ళీ పుకార్లు మొదలయ్యాయి. సుశాంత్ సింగ్ ను ఇబ్బంది పెట్టినట్టుగానే ఇప్పుడు మరో హీరో కార్తిక్ ఆర్యన్ కూడా ఇబ్బంది పెడుతున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.
తాజాగా బాలీవుడ్ కు చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఆ మధ్య ఓ సినిమాని ఎనౌన్స్ చేసింది. ఆ సినిమాలో హీరోగా కార్తిక్ ను తీసుకున్నారు. తమ సినిమా నుంచి ఆ సంస్థ కార్తిక్ ని తొలగించింది. కారణం మాత్రం బయటకు చెప్పలేదు. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎదగాలంటే ఈ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు అని, సుశాంత్ సింగ్, కార్తీక్ ఆర్యన్ లాంటి హీరోలను బడా నిర్మాతలు కావాలనే పక్కన పెట్టేస్తున్నారని టాక్ నడుస్తోంది.
పలువురు నెటిజన్లు కూడా ఇలాంటి కామెంట్స్ నే చేస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటనతో కార్తిక్ ఆర్యన్ కెరీర్ గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. మధ్యప్రదేశ్ చెందిన కార్తిక్ ఆర్యన్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. అయితే, కార్తిక్ మాత్రం నటుడిగా రాణించడానికి చాల కష్టపడ్డాడు.
డైరెక్టర్ రంజన్ తెరకెక్కించిన ‘ప్యార్ కా పంచ్‌నామా’తో 2011లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత ‘ఆకాశ్ వాణి’ ‘సోనూ కే టీటు కి స్వీటీ-2’, ‘పతి పత్నీ ఔర్ హో’ లాంటి చిత్రాలతో కమర్షియల్ విజయాలు సాధించాడు. దాంతో కార్తిక్ కు స్టార్ స్టేటస్ సొంతమైంది. ఇక బాలీవుడ్ లో స్టార్ గా ఎదుగుతాడు అనుకుంటున్న టైమ్ లో హిందీ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడెక్షన్స్ కార్తిక్ ఆర్యన్ తమ సినిమా ‘దోస్తానా-2’ నుండి తప్పించింది. అలాగే అతని భవిష్యత్తు సినిమాలను కూడా తొక్కాలని చూస్తున్నారట.