https://oktelugu.com/

Stree 2 Collections: RRR రికార్డులను ట్రిపుల్ మార్జిన్ తో దాటేసిన ‘స్త్రీ 2’.. బాలీవుడ్ లో చిన్న సినిమా ప్రభంజనం!

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన 'స్త్రీ' అనే చిత్రానికి ఇది సీక్వెల్. 2018 వ సంవత్సరం లో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను భయపెట్టి భారీ వసూళ్లను రాబట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 16, 2024 / 12:08 PM IST

    Stree 2 movie breaks RRR record

    Follow us on

    Stree 2 Collections: ఒకప్పుడు ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలన్నా, ఓపెనింగ్స్ ఘనంగా రావాలన్నా హీరో స్టామినా మీదనే ప్రధానంగా ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా జనాలకు ఆసక్తికరమైన కంటెంట్ ఇవ్వకపోతే ఓపెనింగ్స్ రావడం లేదు. అదే విధంగా పెద్దగా స్టార్ క్యాస్ట్ ఏమి లేకపోయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ నుండి క్లోసింగ్ వరకు కళ్ళు చెదిరే వసూళ్లు ఈమధ్య కాలంలో వస్తున్నాయి. అలాంటి సినిమాలలో ఒకటి నిన్న విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘స్త్రీ 2’. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన ‘స్త్రీ’ అనే చిత్రానికి ఇది సీక్వెల్. 2018 వ సంవత్సరం లో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను భయపెట్టి భారీ వసూళ్లను రాబట్టింది.

    అలాంటి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కడం తో ‘స్త్రీ 2’ పై మొదటి నుండి మంచి అంచనాలే ఉండేవి. ఇక నిన్న నేషనల్ హాలిడే కూడా కలిసి రావడంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో వచ్చాయి. బాలీవుడ్ ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 55 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ స్థాయి వసూళ్లు ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ కి కూడా రాలేదు. #RRR చిత్రానికి బాలీవుడ్ లో మొదటి రోజు 18 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అంటే ‘స్త్రీ 2’ చిత్రానికి #RRR కంటే మూడు రెట్లు వసూళ్లు వచ్చాయి అన్నమాట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. అలాగే ఈ ఏడాది విడుదలైన ‘కల్కి’ చిత్రం మొదటి రోజు వసూళ్లను కూడా ఈ సినిమా దాటేసిందట. ఇది మామూలు విషయం కాదు. ‘స్త్రీ 2 ‘ లో హీరోయిన్ గా నటించిన శ్రద్దా కపూర్ అంతకు ముందు ప్రభాస్ తో సాహూ చిత్రం లో హీరోయిన్ గా చేసింది. అలాంటి నటి నేడు ప్రభాస్ కంటే ఎక్కువ రేంజ్ వసూళ్లు రాబట్టడం అందరూ ఎప్పటికీ గుర్తించుకునే విషయం. శ్రద్దా కపూర్ కి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది.

    ముఖ్యంగా ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఒక్కసారి తెరిచి చూస్తే, ఆమెకోసం యువత ఎంతలా పడిచస్తున్నారో అర్థం అవుతుంది. హీరోలతో సంబంధం లేకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా ఆమె మంచి ఓపెనింగ్ వసూళ్లను రాబట్టగలదు. మన సౌత్ లో అనుష్క, నయనతార వంటి హీరోయిన్స్ కి ఎలాంటి స్థానం ఉంటుందో, బాలీవుడ్ లో దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్ కి అలాంటి స్థానం ఉంటుందట. ఇకపోతే మొదటి రోజే 55 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ‘స్త్రీ 2’ చిత్రం, ఫుల్ రన్ లో కచ్చితంగా 400 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.