https://oktelugu.com/

ANR: నా వల్ల ఎదిగింది, నాకే ఇవ్వరా ?, బాధను దిగమింగుకున్న ఏఎన్నార్ !

ANR: తెలుగు ప‌రిశ్ర‌మ మొదట్లో మ‌ద్రాసులో ఉండేది. దాంతో భారతీయ సినీ లోకంలో తెలుగు తనానికి సరైన గుర్తింపు వచ్చేది కాదు. ఓ హిందీ చిత్రసీమ అవార్డు ఫంక్షన్ కి వెళ్లిన అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగారిని తమిళ సినిమా వాడిగానే గుర్తించారు, అలాగే పిలిచారు కూడా. ఆ క్షణం నుంచి ఏఎన్నార్ తెలుగు సినీ ప‌రిశ్ర‌మను హైద‌రాబాద్‌ లో అభివృద్ధి చేయాలని మనసులో బలంగా నిర్ణయించుకున్నారు. అదే విషయం అప్పటి సినీ దిగ్గజాలకు చెబితే అందరూ అది కుదరని […]

Written By:
  • Shiva
  • , Updated On : December 17, 2021 6:40 pm
    Follow us on

    ANR: తెలుగు ప‌రిశ్ర‌మ మొదట్లో మ‌ద్రాసులో ఉండేది. దాంతో భారతీయ సినీ లోకంలో తెలుగు తనానికి సరైన గుర్తింపు వచ్చేది కాదు. ఓ హిందీ చిత్రసీమ అవార్డు ఫంక్షన్ కి వెళ్లిన అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగారిని తమిళ సినిమా వాడిగానే గుర్తించారు, అలాగే పిలిచారు కూడా. ఆ క్షణం నుంచి ఏఎన్నార్ తెలుగు సినీ ప‌రిశ్ర‌మను హైద‌రాబాద్‌ లో అభివృద్ధి చేయాలని మనసులో బలంగా నిర్ణయించుకున్నారు. అదే విషయం అప్పటి సినీ దిగ్గజాలకు చెబితే అందరూ అది కుదరని పని అని వారించారు.

    ANR

    ANR

    హైద‌రాబాద్‌ లో పూర్తి సినిమా తీయడం అసాధ్యం అన్నారు. నిజంగానే అప్పటికీ హైద‌రాబాద్‌ లో షూటింగ్ చేయడానికి ఒక్క సార‌థి స్టూడియో మాత్రమే అందుబాటులో ఉంది. పైగా ఆ సమయానికి సార‌థి స్టూడియో చాలా చిన్న స్టూడియో. అయినా అక్కినేని తన షూటింగ్‌ ల‌న్నిటినీ పట్టుబట్టి హైద‌రాబాద్‌ లో సార‌థి స్టూడియోలోనే పెట్టించేవారు. కానీ, ఆ నాటికి ఇండ‌స్ట్రీ మొత్తం మ‌ద్రాసులోనే ఉంది.

    ఒక్క అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగారి సినిమాల కోసమే అప్పటి సినీ ప్రముఖులు హైద‌రాబాద్‌ కి వ‌చ్చేవాళ్లు. అలా అలా ఏఎన్నార్ సాయంతో సార‌థి స్టూడియో ఎంతో ఎదిగింది. నిత్యం సినిమాల షూటింగ్ లతో స్టూడియోలో కోలాహలం కనిపించేది. ఆ సమయంలో హఠాత్తుగా అక్కినేని ఆపరేషన్ కోసం ఫారిన్‌ వెళ్లాల్సి వచ్చింది. అంతలో ఏఎన్నార్ కి సీరియస్ అనే పుకార్లు కూడా బాగా వినిపించాయి.

    అక్కినేని గారు ఇక తిరిగి వ‌స్తారో రారో అని కొంతమంది నిర్మాత‌లు, దర్శకులు ఆయనతో ప్లాన్ చేసిన సినిమాలను శోభ‌న్‌ బాబుతో తీయడం మొదలుపెట్టారు. అప్పటి సార‌థి స్టూడియో యాజమాన్యం కూడా ఏఎన్నార్ సినిమాల కోసం ఉంచిన డేట్లును వేరే హీరోల సినిమాలకు ఇచ్చేసింది. ఆరోగ్యం కుదుట పడి ఏఎన్నార్ ఫారిన్ నుంచి తిరిగి వచ్చారు. పూర్తిగా కోలుకున్నారు.

    ఇక మధ్యలో ఆగిపోయిన తన సినిమాల షూటింగ్ ను ప్లాన్ చేసుకున్నారు. అయితే, స్టూడియోలో తన సినిమాకి కేటాయించిన ప్లోర్ ను వేరే హీరోకి ఇచ్చారని తెలిసింది. కాస్త ఇబ్బందిగా భావించినా అక్కినేని సహనం వహించి వారం రోజులు ఎదురుచూశారు. అయినా స్టూడియోలో తన సినిమాకి డేట్లు లేవనే సమాధానమే వస్తోంది. ఇక నేరుగా ఏఎన్నారే వెళ్లి.. ‘నా బ్యానర్ లో వస్తోన్న నా ఓన్ పిక్చర్ ఇది. మన స్టూడియోలో నాకు ఒక ఫ్లోర్ కావాలని అడిగారు.

    Also Read: Bala Krishna: బాలకృష్ణ – గోపిచంద్ సినిమాలో ముఖ్య పాత్ర చేయనున్న… వరలక్ష్మి శరత్ కుమార్

    అప్పటి సార‌థి స్టూడియో యాజమాన్యం ఖాళీ లేద‌ని మొహమాటం లేకుండా చెప్పింది. అక్కినేని మనసు నొచ్చుకుంది. ‘ఏమి లేని ఈ స్టూడియో నా వల్ల గొప్పగా ఎదిగి, చివరకు నాకే షూటింగ్ కి ఇవ్వరా ?’ అని ఏఎన్నార్ బాధను దిగమింగుకొని.. పౌరుషంతో నేరుగా అప్ప‌టి ముఖ్యమంత్రి బ్ర‌హ్మానంద‌రెడ్డి దగ్గరకు వెళ్లారు. బ్ర‌హ్మానంద‌రెడ్డిగారికి ఏఎన్నార్ గారికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.

    చిలిపి కృష్ణుడిలా ఎప్పుడూ నవ్వుతూ ఉండే అక్కినేని ముఖబింబం, మండే సూర్యుడిలా రగులుతూ ఉంది. ఏమైందయ్యా అన్నట్టు చూశారు బ్ర‌హ్మానంద‌రెడ్డిగారు. ‘నేను హైద‌రాబాద్‌ లో సినీ స్టూడియో కట్టాలనుకుంటున్నాను, స్థ‌లం కావాలి’. ఏఎన్నార్ అడగగానే ప్రభుత్వం ఇచ్చేసింది. అలా ఏఎన్నార్ గారు అన్నపూర్ణ స్టూడియో కట్టించి.. ‘నాకు ఇది దేవాలయంతో స‌మానం’ అంటూ ఆయన చివరి రోజు వరకూ స్టూడియోని ఎంతో ప‌విత్రంగా చూసుకున్నారు.

    Also Read: 2021 Hit Movies: 2021లో వచ్చిన హిట్ సినిమాల్లో ఎక్కువ శాతం ఈ కోవకు చెందినవే..

    Tags