https://oktelugu.com/

Sarkaru Vari Pata: ‘సర్కారువారి పాట’ షూటింగ్ పూర్తి కాలేదట.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే?

Sarkaru Vari Pata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా  పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట.  ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా… ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్​ కూడా పూర్తి చేసుకుని.. పోస్ట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 23, 2021 / 01:15 PM IST
    Follow us on

    Sarkaru Vari Pata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా  పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట.  ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా… ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్​ కూడా పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే మహేశ్​ గతంలో తన కాలికి తలిగిన గాయం కాస్త ఇబ్బంది పెట్టడంతో.. సర్జరీ కూడా చేయించుకున్నాడు.

    హమ్మయ్యా.. అంతా అయిపోయింది.. ఇక సినిమా రిలీజ్​ కోసమే వేయిటింగ్​ అనుకుంటుండగా.. ఇండస్ట్రీలో మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదట.. ఇంకా నెలరోజులకు పైగా బ్యాలన్స్ మిగిలుందని సమాచారం. మహేశ్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి విహారయాత్రల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో షూటింగ్​ స్టార్ట్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మహేశ్ కూడా అదే సమయానికి తిరిగి రానున్నాడని సమాచారం. ఈ సినిమాకు థమన్​ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

    ఈ చిత్రంలో మహేష్ బాబు స్టైలీష్ లుక్‏లో కనిపిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.  ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించగా పలు కారణాల వల్ల ఏప్రిల్ కు మార్చారు.