Homeఎంటర్టైన్మెంట్Hero Nani: థియేటర్ కౌంటర్​ కంటే.. కిరాణా కొట్టు కలెక్షన్లు బెటర్​.. ఏపీ సర్కారుపై నాని...

Hero Nani: థియేటర్ కౌంటర్​ కంటే.. కిరాణా కొట్టు కలెక్షన్లు బెటర్​.. ఏపీ సర్కారుపై నాని సంచలన వ్యాఖ్యలు

Hero Nani: ఆంధ్రప్రదేశ్​లో సినిమా టికెట్ల వ్యవహారం పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఏపీలో సినిమా టికెట్ల విధానంపై తమదైన శైలిలో సెటైర్లు వేస్తూ పోస్ట్ చేశారు. త్రివిక్రమ్​ కూడా ఒక పేదవాడి కథ అంటూ జగన్ పాలనపై ట్వీట్​ చేశాడు. తాజాగా, సీనియర్ నటుడు బ్రహ్మాజీ కూడా తనదైన స్టైల్​లో అందరికీ వరాలు ఇస్తున్నారు.. వాళ్ల మీద కూడా కనికరం చూపండంటూ.. పోస్ట్ చేశాడు. తెలంగాణ థియేటర్లలో పార్కింగ్ ఫీసుతో పోలుస్తూ మరి ఏపీ సర్కారు నిర్ణయంపై సెటైర్లు వేశారు.

nani-sensational-comments-on-ap-ticket-rates

మరోవైపు, డిస్ట్రిబ్యూటర్లు ఈ రేట్లతో సినిమాలు వేసి నష్టాల్లో కూరుకుపోయే కన్నా.. థియేటర్లు మూసేసుకోవడమే మంచిదని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని థియేటర్లను మూసేశారు.  ఈ విషయంపై డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకెళ్లినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. తాజాగా, ఈ విషయంపై టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని  సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాని హీరోగా నటించిన శ్యామ్​ సింగరాయ్ సినిమా డిసెంబరు 24న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయన.. ఏపీ టికెట్​ ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్​ కాదు. ఇలా చేయడం ప్రేక్షకులను అవమానించడమే అవుతుంది.  థియేటర్​ రన్ అవ్వడం వల్ల 10 మందికి ఉపాధి లభిస్తుంది. కానీ, ఈ ధరలను చూస్తుంటే.. టికెట్ కౌంటర్ కంటే.. పక్కనే ఉన్న కిరాణా షాప్​లో ఎక్కవ లాభాలొస్తున్నాయి. అని చెప్పుకొచ్చారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version