మాతృ దినోత్సవం నాడు మాతృమూర్తులతో స్టార్లు !

తల్లిని గౌరవించడానికి ప్రేమించడానికి ఏ రోజు అయితేనేం ? కానీ, మదర్స్ డే అంటూ సంవత్సరంలో ఒక రోజు అమ్మకు కేటాయించారు విదేశీయులు. ఐతే, జీవితాన్ని ఇచ్చిన మహిళ పట్ల ఎంత ప్రత్యేకించి ప్రేమను చూపించినా, అచ్చం తల్లిలా బిడ్డ ప్రేమించడం సాధ్యం అవుతుందా ? అయినా ప్రతి బిడ్డకు ప్రతి తల్లికి మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పడానికి ఒక రోజు సరిపోదు. తల్లిని గౌరవించే వేడుక అంటూ ఒక రోజును కేటాయించొచ్చు, కానీ మాతృత్వంలో […]

Written By: NARESH, Updated On : May 9, 2021 6:59 pm
Follow us on

తల్లిని గౌరవించడానికి ప్రేమించడానికి ఏ రోజు అయితేనేం ? కానీ, మదర్స్ డే అంటూ సంవత్సరంలో ఒక రోజు అమ్మకు కేటాయించారు విదేశీయులు. ఐతే, జీవితాన్ని ఇచ్చిన మహిళ పట్ల ఎంత ప్రత్యేకించి ప్రేమను చూపించినా, అచ్చం తల్లిలా బిడ్డ ప్రేమించడం సాధ్యం అవుతుందా ? అయినా ప్రతి బిడ్డకు ప్రతి తల్లికి మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పడానికి ఒక రోజు సరిపోదు.

తల్లిని గౌరవించే వేడుక అంటూ ఒక రోజును కేటాయించొచ్చు, కానీ మాతృత్వంలో నిస్వార్ధ ప్రేమను వ్యక్తపరచడానికి జీవిత కాలం కూడా సరిపోదు. అంత గొప్పది తల్లిప్రేమ, ప్రసూతి బంధాల నుండి మొదలుపెడితే సమాజంలో తల్లుల ప్రభావం వరకూ ప్రతి విషయంలో ప్రతి ప్రాణి ఆలోచనా విధానంలో తల్లి తాలూకు ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఓ సర్వేలో తేలింది.

అయినా, తల్లి తనాన్ని ఏ సర్వేతో కొలవలేం, ఏ పదాలతో పోల్చలేం, అందుకే దేశానికీ రాజు అయినా, తల్లికి బిడ్డే అన్నారు. ఎంత గొప్ప స్టార్స్ అయినా ఎంత గొప్ప హీరోలు అయినా తమ తల్లి ముందు వారు ఇప్పటికీ బిడ్డలమే అంటున్నారు. మాతృ దినోత్సవం రోజున తమ మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్లతో దిగిన ప్రత్యేక ఫొటోల్ని తమ అభిమానులతో పంచుకున్నారు ప్రముఖులు.

‘తనకు మాటలు వినపడకపోయినా మాకు మాటలు నేర్పింది.. నడక నేర్పింది.. నడత నేర్పింది.. ఏ కష్టం రాకుండా ఐదుగురు సంతానాన్ని పెంచి పెద్ద చేసింది’ అని ఎమోషనల్ అయ్యారు మోహన్‌ బాబు. అలాగే మెగాస్టార్ కూడా ‘తన తల్లి, తోబుట్టువులతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘నా టీచర్‌, నా బెస్ట్‌ ఫ్రెండ్‌ మా అమ్మ’ అంటూ మంచి మెసేజ్ ను ఇచ్చారు. హీరో నాని తన కొడుకుతో కలిసి తన తల్లి ఒడిలో పడుకుని దిగిన ఫోటో కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.