Stars last movie blockbusters: మన దేశంలో క్రికెట్ స్టార్లతో పాటు సినిమా స్టార్లకు కూడా విపరీతమైన అభిమానగణం ఉంటుంది. క్రికెట్ స్టార్లు ఎప్పుడో మ్యాచ్ ఉన్నప్పుడే మురిపిస్తే సినిమా తారలు మాత్రం జీవితకాలం అభిమానులకు దగ్గరగానే ఉంటారు. అలాంటి వారు చనిపోతే ఎంతో మంది దుఖసాగరంలో మునిగిపోతారు. సహజంగా నటులకు అభిమానులు ఎక్కువే ఉంటారు. అది ఏ సినిమా అయినా కానీ అభిమానులు తమ గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకుంటారు. అలాంటి వారిలో ఓ పునీత్ రాజ్ కుమార్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, విష్ణువర్ధన్, అక్కినేని నాగేశ్వర్ రావు, దివ్యభారతి, శంకర్ నాగ్, రియల్ స్టార్ శ్రీహరి, బ్రూస్ లీ లాంటి వారు ఉన్నా వారు నటించిన చిత్రాలను వారు చనిపోయిన తరువాత చూసుకుని మురిసిపోతుంటారు. వాటిని విజయవంతం చేసి మరీ తమ సానుభూతి వ్యక్తం చేశారు.
అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ తనదైన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఆయన చనిపోయే నాటికి నిర్మాణంలో ఉన్న సినిమా జేమ్స్ ప్రస్తుతం విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆయన లేని లోటును భర్తీ చేస్తోంది. అభిమానుల కళ్లల్లో ఆయన లేని లోటు మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. శంకర్ నాగ్ అనే ఒకప్పటి హీరో సైతం 1990లో కారు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన నటించిన సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలై నాడు సంచలన విజయాలు అందుకున్నాయి.
మన తెలుగులో రియల్ స్టార్ శ్రీహరి ఎన్నో చిత్రాల్లో నటించి అభిమానులను మెప్పించారు. అలాంటిది ముంబైలో రాంబో రాజ్ కుమార్ సినిమా షూటింగ్ కోసం వెళ్లి అక్కడే చనిపోయారు. శ్రీహరి చనిపోయాక విడుదలైన రాంబో రాజ్ కుమార్ విజయం సాధించి ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. అందరిని అలరించిన తార దివ్యభారతి. అందమైన రూపంతో అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆమె 1993లో తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఆమె మరణానంతరం విడుదలైన ‘తొలిముద్దు’ సినిమా విజయవంతమై ఆమె లేని లోటు తీర్చింది.
Also Read: రాంచరణ్ గొప్ప మనసు.. ఉక్రెయిన్ లో తన బాడీ గార్డ్ కు సాయం..
తెలుగు సినిమాల్లో తొలి తరం స్టార్ హీరోల్లో అక్కినేని నాగేశ్వర్ రావు ఒకరు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీసు దగ్గర సంచలన విజయాలు నమోదు చేశాయి. అలాంటిది ఆయన ఆఖరి చిత్రం ‘మనం’ కూడా ఆయన చనిపోయాకే విడుదలైంది. కొడుకు నాగార్జున, మనవళ్లు నాగచైతన్య, అఖిల్ తో కలిసి నటించిన నాగేశ్వర్ రావు చివరకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కానీ ఆయన మరణాంతరం వచ్చిన ఈ మూవీ ఎంతో ఘన విజయం సాధించడం తెలిసిందే.
ఇలా సినిమా తారలు చనిపోయినా వారి చివరి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. చనిపోయినా తమ అనుభవాలు, పాత్రల ద్వారా ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడు కొలువై ఉంటారు. కానరాని లోకాలకు వెళ్లినా తమదైన శైలిలో అలరిస్తూ ఉన్నారు.. చివరి సినిమాల ద్వారా కూడా వారు చిత్ర విజయంలో కీలక పాత్రలు పోషించారు.
Also Read: హీరో బాలకృష్ణ డిమాండ్ కు ఆయన ఫ్యాన్ సీఎం జగన్ ఓకే.. చంద్రబాబుకు షాక్