Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. లవ్ స్టోరి హిట్ తర్వాత నాగ చైతన్య వరుస చిత్రాలను చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ చిత్రం పూర్తి కావస్తుండగా, తమిళ టాప్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ చిత్రాన్ని మొదలుపెట్టాడు. గతంలో అజిత్‌తో ‘మంకత్తా’ (గ్యాంబ్లర్) వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకట్ ఇటీవలి ‘మానాడు’తో సూపర్ హిట్ కొట్టి శింబుని మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కించాడు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలో రానుంది.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. సినిమాలో ముస్లింలను టెర్రరిస్టులుగా చూపించడంతో బీస్ట్‌కి కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ ఉదంతంతో కువైట్ ప్రభుత్వం బీస్ట్ విడుదల కాకుండా బ్యాన్ చేసింది. ఇక తమిళనాడులోనూ ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ తమిళనాడు ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర హోంశాఖకు లేఖ రాసింది. ముస్లింలను ఇప్పటికీ తీవ్రవాదులుగా చిత్రీకరించడం, మతపరమైన సమస్యలకు కారణమవుతోందని అంటున్నారు.
Also Read: K.G.F: Chapter 2: ‘కేజీఎఫ్ 2’ నుంచి ఎదగరా ఎదగరా.. క్షణాల్లోనే సంచలనాలు

ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. సాధారణంగా చాలామంది ఏడాది ద్వితీయార్థంలో అయ్యప్ప దీక్షను చేపడుతుంటారు. కానీ రామ్ చరణ్ తరచూ 41 రోజుల అయ్యప్ప దీక్ష చేపడుతుంటాడు. ఇటీవలే RRR ఘనవిజయ ఫలితం రాగానే వెంటనే దీక్షలోకి దిగాడు చరణ్. ఇందుకు చిరు మార్గదర్శకమే కారణమంటారు. ఈ దీక్ష వల్ల విజయాలకి పొంగిపోకుండా, అహాన్ని అదుపులో ఉంచుకుంటూ, ఎదిగినా ఒదిగి ఉండడం జరుగుతుందట. తండ్రి బాటలోనే తనయుడు నడుస్తున్నాడంటున్నారు ఫ్యాన్స్.

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. పుష్ఫ-1 చిత్రీకరణకు ముందు విడుదలైన బన్నీ ఫస్ట్ లుక్ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. సరికొత్త మాస్ లుక్‌లో బన్నీని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఇలానే పుష్ప-2 ఫస్ట్ లుక్‌లో కూడా బన్నీ సర్‌ప్రైజ్ చేయనునున్నాడు. ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప-2 ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. పుష్ఫ-2లో బన్నీ మూడు గెటప్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది.
Also Read:CM KCR- Governor Tamilisai: ఢిల్లీకి చేరిన సీఎం, గవర్నర్ పంచాయితీ?