Mahesh-Namrata: ప్రేమకు వయసుతో పని లేదు. అలాగే ప్రేమ కులమతాలను కూడా చూడడు. ఇక వారి వృత్తి ప్రవృత్తిలను కూడా ప్రేమ పట్టించుకోదు. ప్రేమకు కావల్సింది మనసు. మనసు మనసు కనెక్ట్ అయితే.. వయస్సు బేధాలను ఆస్తుల ఐశ్వర్యాలు పట్టింపులోకి రావు. ఇదే విషయాన్ని విశ్వసనీయతతో రుజువు చేసిన కొన్ని సినిమా జంటలు ఉన్నాయి.

ఈ జంటల్లో ముఖ్యంగా ముచ్చటించుకోవాల్సింది హీరోయిన్స్ గురించే. కొందరు హీరోయిన్స్ తమకంటే వయస్సు తక్కువున్న వారిని ఘాడంగా ప్రేమించి పెళ్ళిచేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు. మరి ఆ జంటలేంటో వాళ్ళ ప్రేమ ముచ్చట్లు ఏమిటో చూద్దాం రండి.
1.మహేష్ బాబు & నమ్రత:

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి ‘నమ్రతా శిరోద్కర్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
మహేష్ కంటే.. నమ్రతా వయసులో పెద్దది. వయసులో మహేష్ బాబు కంటే నమ్రతా శిరోద్కర్ నాలుగేళ్లు పెద్దది. అయితే, మొదట్లో వీరి వయసు పై అనేక కామెంట్స్ వినిపించేవి. అయినా అవి ఏమి పట్టించుకోకుండా ఈ జంట ఒక్కటి అయింది.ఇక మహేష్ తో వివాహం చేసుకున్న తర్వాత నమ్రతా పూర్తిగా సినిమాలకు దూరమైయ్యారు. మహేష్ బాబుకు సంబంధించిన అన్ని విషయాల్లో యాడ్స్, సినిమాలు, వ్యక్తిగత జీవితంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read: మరోసారి ఢిల్లీకి.. ఈసారి సీరియస్ గానే?
2 . శరత్ బాబు & రమప్రభ:

సీనియర్ నటి రమప్రభ గారిది శరత్ బాబుది కూడా లవ్ మ్యారేజ్. అప్పట్లో రమప్రభ గారు శరత్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రమప్రభ గారు శరత్ బాబు కంటే 10 ఏళ్లు పెద్ద. అయితే వీళ్ళు పెళ్లైన పడేళ్లకు విడిపోయారు.
3. అభిషేక్ బచ్చన్ & ఐశ్వర్యారాయ్:

క్రేజీ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ అభిషేక్ కంటే వయసులో 2 ఏళ్లు పెద్దది. అయినా ఈ జంట లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం సంతోషంగా ఉంటున్నారు
4. రాజ్ కుందా & శిల్పాశెట్టి:

అశ్లీల చిత్రాల సృష్టికర్తగా పేరుప్రఖ్యాతలు సాధించిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా శిల్పాశెట్టి కంటే రెండునెలల చిన్నవాడు. పైగా వీరిది సెకెండ్ మ్యారేజ్.
5. ఇంద్రానిల్ & మేఘన:

ఇంద్రానిల్ & మేఘన బుల్లితెర పై బాగా ఫేమస్. చక్రవాకం సీరియల్ లో అత్త అల్లుడిగా నటించారు వీరిద్దరూ. ఆ సమయంలో ప్రేమలో పడి పెళ్లికూడా చేసుకున్నారు. అయితే, ఇంద్రానిల్ కంటే మేఘన 5 సంవత్సరాల పెద్ద కావడం విశేషం.
Also Read: 100 కోట్లుతో పాటు 10 శాతం లాభాలు తీసుకుంటున్న ప్రభాస్ !
[…] Also Read: చిన్న వారిని ప్రేమించి పెళ్లి చేసుకు… […]
[…] Akhanda Collections: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా మేనియా తమిళంలో పాకబోతుంది. మొత్తమ్మీద బాలయ్య అఘోరాగా కనిపించి, అభిమానులను ఎంతగానో అలరించాడు. కాగా ఈ క్రేజీ సూపర్ హిట్ సినిమా అఖండ. 50 రోజులు నిర్విరామంగా ఆడింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం ఈ రోజు తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. […]