
Alia Bhatt: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తారు సినిమా తారలు. ఇందుకోసం యాడ్స్, ఓపెనింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడే డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేయొచ్చని ఈ మధ్య చాలామంది యాడ్స్, ఓపెనింగ్స్‌కు వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఓ తార హీరోయిన్‌గా మానేసి తెగ సంపాదిస్తోంది. సినిమాల్లోనే కాదు రాణించిన ఆ నటి ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతోంది బాలీవుడ్ నటి అలియా భట్. తన ప్రెగ్నెన్సీ సమయంలో ఆమె ప్రారంభించిన దుస్తుల కంపెనీ విలువ ఏడాదిలోనే రూ.150 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిందట!
బాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్..
అలియా భట్.. ఈ తరానికి పరిచయం అవసరం లేని పేరు. గ్లామర్ పాత్రలతోపాటు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ రాణిస్తున్న తార. బాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న అలియా కేవలం నటి మాత్రమే కాదండోయ్. . విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. సినీ రంగంలోనే కాదు.. వ్యాపార రంగంలోనూ తనదైన స్టైల్‌తో అదరగొడుతూ నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ బాలీవుడ్ తార బుధవారం 30వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా వ్యాపార రంగంలో ఆలియా సాధించిన విజయాన్ని ఓసారి తెలుసుకుందాం.
రణబీర్‌తో లవ్.. మ్యారేజ్..
చిన్నతనంలోనే తెరపై హీరో రణ్‌బీర్‌ను చూసి ఇష్టపడి అతడినే పెళ్లి చేసుకోవాలన్న తన కలను నిజం చేసుకున్న అలియా భట్.. వ్యాపార రంగంలోనూ అంతే పట్టుదలతో దూసుకెళ్లింది. ప్రెగ్నెన్సీ సమయంలో చిన్న పిల్లల బట్టల వ్యాపారాన్ని ప్రారంభించి లాభాల బాటలో పయనించింది. కొన్నాళ్లపాటు ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చిన ఆమె.. తొలిసారి 2022లో తాను గర్భిణిగా ఉన్న సమయంలోనే చిన్నారుల కోసం ఎడ్ – ఎ – మామా పేరిట దుస్తుల విక్రయం మొదలుపెట్టింది. ఏడాదిలోనే కంపెనీ విలువ రూ.150 కోట్ల మార్కును దాటడం విశేషం.

12 నెలల్లో పది రెట్ల వృద్ధి..
అలియా వ్యాపారం కేవలం 12 నెలల్లో ఈ కంపెనీ 10 రెట్లు వృద్ధిని సాధించి. రెండు నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల దుస్తులను విక్రయించే ఈ వెబ్‌సైట్‌లో దాదాపు 800 వరకు వస్తువులు అందుబాటులో ఉన్నాయి. గతంలో అగరబత్తులు, నూనెలు తయారు చేసే కంపెనీలతోపాటు నైకా, ఫూల్.కో, స్టైల్‌క్రాకర్ వంటి సంస్థల్లో అలియా పెట్టుబడులు పెట్టింది. వ్యాపారం గురించి తాను ఇంకా నేర్చుకుంటున్నానని చెప్పే అలియా… తన బిజినెస్ క్రెడిట్ తన కంపెనీకే చెందుతుందని చెబుతుంది.
అటు బాలీవుడ్ స్టార్‌గా, ఇటు వ్యాపారవేత్తగా రాణిస్తున్న అలియా భట్ నికర ఆస్తుల విలువ రూ.229 కోట్లు అని సమాచారం. ఆమె సినిమాల్లో ఒక్కో పాత్రకు సుమారు రూ.20 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అలియాకు బీఎండబ్ల్యూ 7తో పాటు ఆడి ఏ6, ఆడి క్యూ7, రేంజ్ రోవర్ వోగ్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.