Sreeleela: కన్నడ సినీ పరిశ్రమ నుండి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, అతి తక్కువ సమయంలోనే వరుసగా సినిమా అవకాశాలను సంపాదించుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి శ్రీలీల(Sree leela). పెళ్లి సందడి వంటి సూపర్ హిట్ చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైనా శ్రీలీల, ఆ తర్వాత ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మూడు సినిమాలు మినహా, శ్రీలీల నటించిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీలు కొడుతూ వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన ‘రాబిన్ హుడ్’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇలా వరుసపెట్టి ఫ్లాప్స్ వస్తున్నప్పటికీ కూడా ఈ హాట్ బ్యూటీ కి మన టాలీవుడ్ లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. బోనస్ గా ఈమె ‘పుష్ప 2 ‘ లో ఐటెం సాంగ్ చేయడం బాగా కలిసొచ్చింది.
Also Read: వామ్మో.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్..
ఈ సినిమా కారణంగా ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు క్యూలు కడుతున్నాయి. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ మొదటి సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. అదే విధంగా ప్రముఖ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్(Kartik Aryan) తో ఒక లవ్ స్టోరీ కూడా చేస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా ఆమె, మరో బాలీవుడ్ క్రేజీ హీరో, కియారా అద్వానీ భర్త సిద్దార్థ్ మల్హోత్రా(Siddarth Malhotra) తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ శాండిల్య దర్శకత్వం లో సిద్దార్థ్ మల్హోత్రా త్వరలోనే ఒక కమర్షియల్ మూవీ ని చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉంది. ఒక హీరోయిన్ పాత్రలో శ్రీలీల ని ఎంచుకోగా, మరో హీరోయిన్ పాత్రలో అనన్య పాండే ని ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
వీటితో పాటు మరో రెండు బాలీవుడ్ సినిమాలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే టాలీవుడ్ లో ఈమె రవితేజ తో ‘మాస్ జాతర’, పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు చేస్తుంది. అదే విధంగా తమిళం లో ఈమె శివకార్తికేయన్ తో కలిసి ‘పరాశక్తి’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈమె డేట్స్ కోసం టాలీవుడ్ లో ఎంతో మంది దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. కానీ డేట్స్ కేటాయించలేని పరిస్థితి. కెరీర్ లో స్వల్పమైన సక్సెస్ రేట్ ఉన్న ఒక హీరోయిన్ కి ఈ రేంజ్ లో అవకాశాలు రావడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. శ్రీలీల అదృష్టం ఆ రేంజ్ లో ఉంది మరీ. ఫ్లాప్స్ లోనే ఆమె ఒక్కో సినిమాకు మూడు కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది. అదే సూపర్ హిట్స్ వరుసగా తగిలి ఉంటే ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి ఉండేదో.