Star Heroine: ఈమె స్టార్ హీరోల సినిమాలలో నటించి నటించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. కానీ ఈ చిన్నది ఒక సినిమాలో ఏకంగా 30 లిప్ లాక్ సీన్స్ లో నటించి బాగా ఫేమస్ అయ్యింది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తన సినీ కెరియర్ ప్రారంభించింది. ఈ బ్యూటీ 2008లో రిలీజ్ అయిన జన్నత్ అనే సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయింది. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది. ఈమె పేరు సోనాల్ చౌహాన్. తొలి సినిమా నుంచి కూడా ఈమె నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది. సోనాల్ చౌహాన్ తెలుగు మరియు హిందీ భాషలలో సినిమాలు అలాగే మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించింది. కానీ ఈమెకు అనుకున్నంత క్రేజ్ రాలేదు. ఆ తర్వాత ఒక సినిమాలో 30 లిప్ లాక్ సీన్స్ లో నటించి ఓవర్ నైట్ లో బాగా ఫేమస్ అయ్యింది. సోనాల్ చౌహాన్ మే 16, 1987లో జన్మించింది. ఈమె నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తన స్కూల్ చదువును పూర్తి చేసింది.
Also Read: ఆ హీరోయిన్ అయినా శర్వానంద్ కి హిట్ ఇస్తుందా? సెంటిమెంట్ రిపీట్ అయితేనే!
ఇక ఆ తర్వాత ఢిల్లీలోని గార్గి కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసింది సోనాల్. 2005లో జరిగిన మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ లో పాల్గొని టైటిల్ విజేతగా నిలిచింది. ఈ టైటిల్ గెలుచుకున్న తొలి ఇండియన్గా సోనాల్ చౌహాన్ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సోనాల్ చౌహాన్ మొదటిసారిగా హిమేష్ రేష్మియా మ్యూజిక్ ఆల్బమ్ ఆప్కా సురూర్ లో సంజో నా పాటలో కనిపించింది. 2008లో ఇమ్రాన్ హష్మీ తో కలిసి జన్నత్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర జన్నత్ సినిమా హిట్ అయిన కూడా ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం రాలేదు. ఇక ఆ తర్వాత సోనాల్ 2013లో 3g ఏ కిల్లర్ కనెక్షన్ అనే సినిమాలో నటించింది. నీల్ నితిన్ ముఖేష్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పొందింది.
కానీ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ సినిమాలో రికార్డు బ్రేకింగ్ గా 30 కిస్ సీన్స్ ఉన్నాయి. గతంలో కూడా ఇమ్రాన్ హష్మీ, మల్లికా శరావత్ నటించిన మర్డర్ సినిమాలో అత్యధికంగా 20 కిస్ సన్నివేశాలు ఉన్నాయి. 30 కిస్ సన్నివేశాలతో ఆ రికార్డును 3g సినిమా బ్రేక్ చేసింది. అత్యధిక కిస్ సన్నివేశాలు ఉన్న సినిమాలో చేసిన హీరోయిన్గా సోనాల్ చౌహాన్ ఓవర్ నైట్ లో బాగా ఫేమస్ అయ్యింది. హిందీ తో పాటు ఈమె తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో కూడా సినిమాలలో నటించింది. సోనాల్ చౌహాన్ 2008లో రెయిన్ బో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగులో నాగార్జున, ప్రభాస్, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోలకు జోడిగా కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇంస్టాగ్రామ్ లో సోనాల్ చౌహాన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
View this post on Instagram