Tollywood Stars : సౌత్ హీరోలందరూ వెకేషన్ ట్రిప్ లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్(Superstar Mahesh Babu) సతీమణి నమ్రత శిరోద్కర్(Namrata Sirodhkar) ఈమధ్య ప్రతీ ప్రైవేట్ పార్టీలలో దర్శనమిస్తుంది. ఆమెతో పాటు మిగిలిన స్టార్ హీరోలు, సంగీత దర్శకులు, స్టార్ హీరోల భార్యలు కనిపిస్తున్నారు. రీసెంట్ గానే ఆమె మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) , సురేఖ పెళ్లి రోజు దినోత్సవ వేడుకల్లో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆమె తన సన్నిహితులు కీర్తి , నితేశ్ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నది. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి. ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలలో ఎన్టీఆర్(Junior NTR), ఆయన సతీమణి ప్రణతి, రామ్ చరణ్(Global Star Ramcharan) సతీమణి ఉపాసన కొణిదెల(Upasana Konidela), అనిరుద్ రవిచంద్రన్(Anirudh Ravichandran), సితార ఘట్టమనేని, ఊర్వశి రౌతేలా, అక్కినేని అఖిల్(Akkineni Akhil), అక్కినేని నాగార్జున ఇలా ఎంతో మంది ఉన్నారు.
వాళ్లందరితో కలిసి దిగిన ఫోటోలను నమ్రత షేర్ చేస్తూ ‘కీర్తి, నితేశ్ లు నేడు కొత్త జీవిత ప్రయాణం ని మొదలు పెట్టారు. జీవితాంతం వాళ్ళ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ పెళ్లి వేడుకలో అనిరుద్ రవిచంద్రన్ మ్యూజికల్ నైట్ హైలైట్ గా నిల్చింది. సౌత్ లో ఆయన కంపోజ్ చేసిన బ్లాక్ బస్టర్ సాంగ్స్ అన్నిటిని పాడాడు. అదే విధంగా ‘నాటు నాటు’ పాటకు అక్కినేని అఖిల్ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ వేసాడు. అయితే ఈ పెళ్లి వేడుకకు రామ్ చరణ్, మహేష్ బాబు రాకపోవడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వివాహ వేడుకకు వచ్చాడు కానీ, నమ్రత ఆయనకు సంబంధించిన ఫోటో ని అప్లోడ్ చేయలేదు. కానీ నేడు దుబాయి లో జరుగుతున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యాడు. ఆయన కూడా దుబాయి లోనే ఉన్నాడు కాబట్టి కచ్చితంగా ఈ పెళ్లి వేడుకకు కూడా వచ్చి ఉంటాడని అభిమానులు ఊహిస్తున్నారు.
Young sensation @AkhilAkkineni8 dance for #NatuNatu in a special event #Akhil6 #AkhilAkkineni pic.twitter.com/PiDPZlmoop
— _ (@AkhilFreaks_FC) February 23, 2025