Bollywood Actors: ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ ని చాలా గొప్పగా చూసేవారు.. బాలీవుడ్ సినిమా ఆఫర్ వస్తే పెద్ద లోపుగా ఫీల్ అయ్యేవారు. కానీ కాలం మారింది.. ఇప్పుడు బాలీవుడ్ హీరోలు సౌత్ లో నటించడానికి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా తెలుగులో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగు సినిమాల్లో బాలీవుడ్ నటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, అనిల్ కపూర్, సునీల్ శెట్టి తెలుగులో నటించారు.
ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అజయ్ దేవగణ్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కూడా చిరు గాడ్ ఫాదర్ లో కీ రోల్ లో నటించబోతున్నాడు. అయితే వీళ్ళ కంటే ముందుగానే బాలీవుడ్ నటులు తెలుగు సినిమాల్లో నటించిన వారు ఎవరో తెలుసుకుందాం.
సంజయ్ డతఁ కెజిఎఫ్ చాప్టర్ 2లో విలన్ గా నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో కనిపించనుండగా.. ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించాడు. వివేక్ ఒబెరాయ్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సినిమాలో బాలీవుడ్ శత్రుజ్ఞ సిన్హా కూడా కీలక పాత్రలో నటించి మెప్పించారు.
అనిల్ కపూర్ తెలుగులో వంశవృక్షం లో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో విలన్ గా నటించాడు. అక్షయ్ కుమార్ తెలుగులో కాకుండా 2.0 లో పక్షిరాజు పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇంకా జాకీ ష్రాఫ్ తెలుగులో అస్త్రం, శక్తి, పంజా చివరగా సాహో లో కనిపించి మెప్పించాడు. యాక్షన్ హీరో అర్జున్ రాంపాల్ తెలుగులో హరిహర వీరమల్లు సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నారు.
Also Read: Dhanush: తెలుగు తెర పై తమిళ ‘సార్’ వస్తున్నాడు !
రవి కిషన్ శుక్లా తెలుగులో అల్లు అర్జున్ రేసు గుర్రం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సైరా నరసింహ రెడ్డి లో బసిరెడ్డి పాత్రలో పలకరించారు. సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో రావణాసురిడిగా నటిస్తున్నాడు.
Also Read: Komuram Bheemudo Song: ఆర్ఆర్ఆర్ : ‘కొమురం భీముడో’ సాంగ్ లిరిక్స్ వాటి అర్దాలివే !