Dhurandhar Collection Day 5: ఈ ఏడాది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘చావా’ తర్వాత అంతటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ రాదేమో అని అంతా అనుకున్నారు. కానీ ఏడాది చివర్లో వచ్చిన రణవీర్ సింగ్(Ranveer Singh) ‘దురంధర్'(Durandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. వీకెండ్ లో ఆడడమే కాదు, వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రం దుమ్ము లేపేస్తోంది. ముఖ్యంగా సింగల్ స్క్రీన్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఈ పీక్ రేంజ్ ట్రెండ్ ని చూస్తూ ఉంటే, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే, సలార్, యానిమల్ చిత్రాల తర్వాత A రేటెడ్ కంటెంట్ తో 500 కోట్ల గ్రాస్ ని దాటిన మూడవ సినిమాగా ‘దురంధర్’ చిత్రం నిలుస్తుందని అంటున్నారు.
మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 106 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు రాగా , సోమవారం రోజున, అనగా నాల్గవ రోజున ఈ చిత్రానికి 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అలా నాలుగు రోజుల్లో 130 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుండి రాబట్టింది. ఇక మంగళవారం రోజున (5వ రోజు) నేషనల్ మల్టీ ప్లెక్స్ చైన్స్ లో ఆఫర్స్ ఉండడం తో ఈ చిత్రానికి సోమవారం కంటే ఎక్కువ వచ్చాయట. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 5వ రోజున 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలా ఓవరాల్ గా ఈ చిత్రానికి 158 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ చిత్రానికి 5.72 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చిందట.
అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూస్తే, దాదాపుగా 42 కోట్ల 42 లక్షల గ్రాస్ వసూళ్లు అన్నమాట. మొదటి రోజు 8 లక్షల డాలర్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజున 1.4 మిలియన్ డాలర్లు, మూడవ రోజున 1.62 మిలియన్ డాలర్లు, నాల్గవ రోజున 9 లక్షల డాలర్లు , 5 వ రోజున 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట. వర్కింగ్ డేస్ లో ఓవర్సీస్ నుండి ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం అనేది చిన్న విషయం కాదు. ఫుల్ రన్ లో కేవలం ఓవర్సీస్ నుండి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.