OPPO PAD 5: భారతీయ మార్కెట్ పై కొన్ని సంవత్సరాలుగా చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలు గుత్తాధిపత్యాన్ని సాగిస్తున్నాయి. అందులో ఒప్పో కంపెనీ ఒకటి. 2026 లో ఒప్పో కంపెనీ రెనో 15 సిరీస్ పేరుతో స్మార్ట్ ఫోన్ ను అందుబాటులో తీసుకొచ్చింది. దీంతోపాటు ఒప్పో ప్యాడ్ 5 ని భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ ప్యాడ్ ప్రీ ఆర్డర్ లో అందుబాటులో ఉంది . ఈ కామర్స్ సైట్ లు, కంపెనీ ఆన్లైన్ స్టోర్ ద్వారా ఇది అందుబాటులో ఉంది.
ఒప్పోప్యాడ్ 10,050 mAh బ్యాటరీ ని సపోర్ట్ చేస్తుంది. ఇది 33 W సూపర్ వూక్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్ సెట్ తో ఇది పనిచేస్తుంది. 8 GB RAM, 256 GB స్టోరేజీ కలిగి ఉంటుంది.
ఒప్పో ఫ్యాడ్ 5 వైఫై మాత్రమే ఉన్న వేరియంట్ ధర 26,999.. వైఫై+ 5G వేరియంట్ ధర 32,999. ఇది 8GB+ 256 GB RAM తో లభిస్తుంది. ఒప్పో 5 ప్యాడ్ ప్రస్తుతం ప్రీ ఆర్డర్లో అందుబాటులో ఉంది. జనవరి 13 నుంచి ఫ్లిప్కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అరోరా పింక్, స్టార్ లైట్ రంగులలో లభ్యమవుతుంది.
ఈ టాబ్లెట్ 12.1 అంగుళాల 2.8 కే ఎల్ సి డి స్క్రీన్ కలిగి ఉంది. ఇది 120 హెచ్ జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 540 హెచ్ జెడ్ వరకు టచ్ షాంప్లింగ్ రేట్, 900 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, 284 పిపిఐ ఫిక్సల్ డెన్సిటీ, 98% డి సి ఐ పి త్రీ కలర్ ను అందిస్తుంది. ఈ టాబ్లెట్ లో ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రాటెక్ చిప్ సెట్ ఉంది. ఇందులో Arm Mali G61 MC2, 8 GB LPDR5x RAM, 256 GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.
ఒప్పో ఫ్యాడ్ 5 లో f/2.0 ఏ పర్చర్, 7 7 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఆటో ఫోకస్, సింగిల్ 8 మెగా ఫిక్సల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియోల కోసం 8 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇందులో ఉంది. 30 ఎఫ్.పి.ఎస్ వద్ద 1080 పిక్సెల్ రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 10,050 ఎం ఏ హెచ్ బ్యాటరీ ఉంది. 33 W sooper vooc వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. యాంబి ఎయిట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఈ కంపాస్, యాక్సిలేరో మీటర్, హాల్ సెన్సార్, ప్రాక్సిమేటి సెన్సార్ ఇందులో ఉన్నాయి. వైఫై సిక్స్, బ్లూటూత్ 5.4, కనెక్టివిటీ కోసం యూఎస్బీ టైప్ సీ సపోర్టు ను ఇది కలిగి ఉంది. దీని బరువు దాదాపు 599 గ్రాముల వరకు ఉంటుంది.