Star Heroes Remuneration: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే చేసిన సినిమాలు చాలా వరకు ఓవర్ బడ్జెట్ కారంగా ఫెయిల్ అవుతున్నాయి. అలాగే ఒక సినిమాకి సక్సెస్ఫుల్ వచ్చినా కూడా ఆ సినిమా లాభాలను సంపాదించే పరిస్థితైతే లేదు. కారణమేంటి అంటే హీరోల రెమ్యూనరేషన్ భారీగా పెంచేస్తున్నారు. అలాగే ప్రొడ్యూసర్లు సైతం హీరో మెప్పు పొందడానికి వాళ్లతో సినిమా చేయడానికి హీరోల మార్కెట్ తో సంబంధం లేకుండా డబ్బులు ఇచ్చేస్తున్నారు. దానివల్ల సినిమా మీద ఎఫెక్ట్ పడుతోంది. అలాగే టికెట్ రేట్లను పెంచడం వల్ల ప్రేక్షకులు ఎవరు థియేటర్ కి రాలేకపోతున్నారు. మొత్తానికైతే ఒక మంచి క్వాలిటీ సినిమాని తక్కువ టిక్కెట్ రేటుతో ప్రేక్షకుడికి అందిస్తే అది కనక బాగుంటే మాత్రం ఆ సినిమాని రెండు మూడు సార్లు చూడడానికైనా ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.
కానీ క్వాలిటీ ప్రోడక్ట్ లేకుండా పైగా బడ్జెట్ ను విపరీతంగా పెంచేసి ప్రేక్షకుల మీద టిక్కెట్ పేరుతో అధిక భారం వేయాలని చూస్తే వాళ్ళు మాత్రం ఎందుకు భరిస్తారు… అందుకే పైరసీని ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి వాళ్లు తమ రెమ్యునరేషన్ ను ఏ రేంజ్ లో అయినా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ప్రొడ్యూసర్లు ఈ విషయంలో కేర్ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది.
సినిమా బడ్జెట్ ఎంత హీరోకి రెమ్యూనరేషన్ రూపంలో ఎంత వెళ్తుంది అనే అన్ని విషయాలను క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత రంగంలోకి దిగితే బాగుంటుంది. ఇక హీరో మార్కెట్ కూడా లెక్కలోకి వహిస్తోంది. తన మార్కెట్ ను మించి బడ్జెట్ పెట్టినట్లయితే మాత్రం అది రికవరీ ఇవ్వడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఓటి వాళ్ళు సైతం సినిమాలను చేయిస్తున్నారు.
ఇక సినిమా థియేటర్ లోకి వచ్చిందో లేదో వీలైనంత తొందరగా ఓటిటి లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. తప్ప సినిమా బాగుందా? లేదా అనేదాని గురించి పట్టించుకునే వాళ్లే కరువైపోయారు… చూడాలి మరి స్టార్ హీరోలందరు రాబోయే రోజుల్లో వాళ్ల రెమ్యునరేషన్స్ ఏమైనా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది…