Kangana Ranaut: బాలీవుడ్ లో వివాదాల హీరోయిన్ ‘కంగన రనౌత్’ అంటేనే చాలామందికి కోపం, కొంతమందికి పగ. కంగనాను ఎలాగైనా టార్చర్ పెట్టాలని హిందీ సినీ ప్రముఖులలో కొందరు ఇప్పటికీ కలలు కంటూ ఉన్నారు. మరి అలాంటి కంగనాకి సన్నిహితులు ఎవరైనా ఉంటారా ? ముఖ్యంగా హిందీ పరిశ్రమలో అందరితో బాగుండే.. కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ జంట కంగనాతో చాలా స్నేహంగా ఉంటుంది.

ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. కంగనాతో ఎందుకు అంత సన్నిహితంగా ఉంటున్నారు అంటూ కొందరు సినీ ప్రముఖులు డైరెక్ట్ గా ఈ కొత్త పెళ్ళి జంటకు క్లాస్ పీకుతున్నారు. ఇంతకీ కంగనా వ్యవహారం ఎందుకు వచ్చింది అంటే.. కొత్త జంట అయిన కత్రినాకైఫ్, విక్కీ కౌశల్.. కంగనా రనౌత్ కు ప్రత్యేకంగా స్పెషల్ గిఫ్ట్ బాక్స్ పంపించారు.
ఐతే, ఆ విషయాన్ని పబ్లిక్ చేస్తూ మొత్తానికి కంగనా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టింది. ‘‘సువాసనతో కూడిన పువ్వులు, రుచికరమైన నేతి లడ్డూలు పంపించినందుకు థ్యాంక్యూ విక్కీ-కత్రినా. కంగ్రాట్స్’’ అంటూ కంగనా మెసేజ్ పెట్టింది. కంగనా చేసిన ఈ పోస్ట్ చూసి.. ముఖ్యంగా హృతిక్, షారుక్ లాంటి స్టార్ హీరోల సన్నిహితులు అసంతృప్తిని వ్యక్తం చేశారట.
Also Read: ఆ హీరో చెప్పిన మాటలు నాపై మాములు ప్రభావం చూపలేదు- ప్రియాంక జవాల్కర్
విష సర్పాన్ని ఎందుకు దగ్గరగా పెట్టుకుంటున్నారు. ఆ సర్పం ఏ నిమిషమైనా కాటు వేయొచ్చు. అందుకే. దాన్ని తరిమికొట్టాలి. అంతేగాని, పువ్వులు, రుచికరమైన నేతి లడ్డూలు పంపి మంచి చేసుకోకూడదు’ అంటూ ‘విక్కీ-కత్రినా’లకు క్లాస్ పీకారు. మొత్తమ్మీద కంగనా అంటే.. హృతిక్ తో పాటు షారుక్ కి కూడా పగ ఉంది. షారుక్ కొడుకు డ్రగ్ కేసులో కంగనా షారుఖ్ ను విమర్శించింది.
అలాగే, అమీర్ ఖాన్ తన సతీమణికి విడాకులు ఇచ్చిన కేసులో కూడా కంగనా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసింది. అసలు ఎప్పుడు ఎవరిని తిడుతుందో అని స్టార్ హీరోల సైతం కంగనా నోరు చూసి భయపడుతూ ఉంటారు. తోటి నటీనటులు అందరూ కంగనా చేతిలో తిట్లు తిన్నవారే. అయితే, ఈ వివాదాల రాణి పై అందరికీ కోపం.