MAA Election: ‘మా’ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ – మంచు విష్ణు మధ్య రసవత్తరంగా మారిన పోటీ ఫలితంగా తెలుగు సినిమా పరిశ్రమ పరువు పోతుందని స్టార్ హీరోలు భావిస్తున్నారు. ఎన్నికల హడావుడి రోజుకో మలుపు తిరుగుతున్నా.. ఏ స్టార్ హీరో పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఎన్నికల పై జీవితా రాజశేఖర్, ఎన్టీఆర్ తో జరిపిన సంభాషణే ఇందుకు ఉదాహరణ.

రీసెంట్ గా జీవిత ఓ పార్టీలో జూ.ఎన్టీఆర్ ను కలిసింది. సహజంగా ఎన్టీఆర్ ఆడవాళ్లకు గౌరవమర్యాదలు ఇస్తాడు కాబట్టి.. ఆమెతో బాగా మాట్లాడాడు. ఈ సందర్భంలోనే ‘మీరు నాకు ఓటు వేయాలి’ అని అడిగింది జీవిత. దానికి ఎన్టీఆర్ రియాక్షన్.. ‘దయచేసి నన్ను అడగొద్దు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే నాకు చాలా బాధాకరంగా ఉంది’ అంటూ ఎన్టీఆర్ చెప్పినట్లు జీవిత చెప్పుకొచ్చింది.
అసలు ఎప్పటి నుంచో స్టార్ హీరోలు పోలింగ్ వేసిన దాఖలాలు చాలా తక్కువ. అన్నీ బాగున్నప్పుడే స్టార్ హీరోలు రాలేదు. మరి ఇప్పుడున్న వివాదాల నేపథ్యంలో స్టార్ హీరోలు ఓట్లు వేయడానికి ఎందుకు వస్తారు ? ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి ఒక్కరి ఓటు కోసం మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి హీరోకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు.
అయితే, ఏ స్టార్ హీరో మాట వరసకు కూడా వచ్చి ఓటు వేస్తామని చెప్పలేదు. అసలు ఆ మాటకొస్తే.. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అలాగే ప్రభాస్, చివరకు పవన్ కూడా గతంలో ఎప్పుడూ తమ ఓటు హక్కును పెద్దగా వినియోగించుకోలేదు. కాకపోతే, ఈ సారి పవన్ కళ్యాణ్ ఓటు వేసే అవకాశం ఉంది. ప్రకాష్ రాజ్ కి పవన్ డైరెక్ట్ గానే మద్దతు తెలుపుతున్నారు. అందుకే పవన్ ఓటు వేస్తారు.
కానీ, మిగిలిన ఏ స్టార్ హీరో ఓటు వేయడానికి ఆసక్తి చూపించడం లేదు. స్టార్ హీరోలు అందరూ ‘మా’ ఎన్నికలకు, ఓటింగ్ కి దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. మాలో రాసుకున్న వివాదం, జరుగుతున్న రాద్ధాంతం ఏ స్టార్ హీరోకి నచ్చలేదు. పైగా స్టార్ హీరోలంతా ప్రస్తుతం వరుస షూట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.
ప్రభాస్, బన్నీ లాంటి కొంతమంది షూట్ కోసం ఔట్ డోర్ వెళ్లారు. మొత్తానికి పెద్ద హీరోలు ‘మా’ ఎన్నికలకు దూరం, ఇక అరకొర అవకాశాలున్నవాళ్లు ‘మా’ యుద్ధంలో పాల్గొనబోతున్నారు. మరి ఈ అరకొర గాళ్ళు ఎటు గాలి బలంగా వస్తే అటు వెళ్ళిపోతారు. మరి గాలి ఎవరి వైపు పయనిస్తోందో..? ఇప్పటి వరకు అయితే విష్ణు వైపే గాలి ఉంది.