బాలీవుడ్ లో ‘కంగనా రనౌత్’ తీరు చాలా మందిని చాలా సంవత్సరాలు తీవ్రంగా బాధిస్తోంది. అంతమందిని బాధ పెడుతూ కూడా సినిమా వాళ్ల అందరిలో కల్లా తనంతటి మంచిది మరొకరు లేదు అన్నట్టుగా ఉంటుంది కంగనా వ్యవహారం. కంగనాను ఇలాగే వదిలేస్తే కష్టం, ఆమెను ఎలాగైనా తొక్కేయాలని చాలా ప్రయత్నాలే జరిగాయి బాలీవుడ్ లో. విచిత్రంగా ఎంత తొక్కేయడానికి ప్రయత్నిస్తే కంగనా అంత ఎత్తుకు ఎదుగుతుంది.
మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న రోజుల్లో కంగనాను చాలామంది చాల రకాలుగా ఇబ్బంది పెట్టారు. వారందరితో తనకు తానుగా పోరాడి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఐతే, ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడి అతనితో చనువుగా ఉండి, మొత్తానికి అతని చేతిలో గాయపడి తనలోని విప్లవాన్ని బయటకు తీసి, నోటికొచ్చినట్టు పేలుతూ.. తనను మోసం చేసిన హీరోను డైరెక్ట్ గానే అడ్డమైన తిట్లు తిడుతూ ఆఖరకు తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకుంది.
కంగనా మార్కెట్ ను దెబ్బ కొడటానికి థియేటర్స్ విషయంలో అలాగే సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో చాలా రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టారు. ఒక రకంగా అన్ని ఇబ్బందులు పడుతూ ‘కంగనా’లా ఎదిగిన హీరోయిన్ మరొకరు లేరు ఏమో. అలాగే కంగనాలా తీవ్ర వేధింపులకు లోనయిన వారు కూడా మరొకరు ఉండరు. ఈ విషయాలను పదే పదే చెప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కంగనా.
ఏది ఏమైనా ఒకవైపు ప్రేక్షకుల సానుభూతిని పొందాలని ఆరాటపడుతునే, మరోవైపు తనకు మాత్రమే సాధ్యం అయిన తన అహాన్ని పరిపూర్ణంగా ప్రదర్శిస్తూ ఉంటుంది కంగనా. అసలు కంగనా ఆలోచనలు ఎవ్వరికీ అంతుపట్టడం సాధ్యం కావు. ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తోందో అర్ధం కాక, అందరూ ఆమెతో మర్యాదగానే ముందుకు పోతున్నారు. స్టార్ హీరోలు సైతం కంగనా నోరు ముందు, తీరు ముందు నిలబడడానికి భయపడుతున్నారు అంటేనే కంగనా అంటే ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.