Star hero wife : పైన ఫోటోలో ఉన్న అమ్మాయి ఓ హీరోయిన్. గతంలో రెండు సినిమాలు చేసింది. అనంతరం ఓ యువ హీరోని వివాహం చేసుకుంది. ఆమె ఎవరో కాదు రహస్య గోరక్. క మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన కిరణ్ అబ్బవరం సతీమణి. రహస్య గోరక్ మొదటి చిత్రం రాజావారు రాణిగారు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం సైతం హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. 2019లో విడుదలైన రాజావారు రాణిగారు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కామెడీతో పాటు ఎమోషనల్ లవ్ డ్రామా వర్క్ అవుట్ కావడంతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అనంతరం రహస్య గోరక్ తమిళంలో షరబత్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. తర్వాత నటనకు దూరమైంది. తన మొదటి సినిమా హీరో కిరణ్ అబ్బవరంతో ఆమె ప్రేమలో పడింది. దాంతో నటనకు స్వస్తి పలికింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2024లో వివాహం చేసుకున్నారు. త్వరలో రహస్య పండంటి బిడ్డకు జన్మను ఇవ్వనుంది. పట్టుచీరలో నిండైన గర్భంతో ఉన్న రహస్య గోరక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read : కఠిన ఆసనం వేసిన ఈ భామ ఓ స్టార్ హీరో వైఫ్… తెలిశాక మీ మైండ్ బ్లాక్ అవుతుంది!
క మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో రహస్య గోరక్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. మా ఆయన కోసం ఒకసారి క మూవీ చూడండి అంటూ రహస్య ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేసింది. క మూవీలో మంచి కంటెంట్ ఉన్న నేపథ్యంలో భారీ విజయం అందుకుంది. క మూవీతో పాటు విడుదలైన అమరన్, లక్కీ భాస్కర్ సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. తీవ్ర పోటీ మధ్య క చిత్రం రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. క చిత్రానికి కొనసాగింపుగా క 2 తెరకెక్కించనున్నారు.
కిరణ్ అబ్బవరం చివరి చిత్రం దిల్ రుబా మాత్రం నిరాశపరిచింది. ఈ యాక్షన్ లవ్ డ్రామా ఆశించిన స్థాయిలో ఆడలేదు. క చిత్రానికి కొనసాగింపుగా క-ర్యాంప్ టైటిల్ తో మూవీ చేస్తున్నాడు. దాంతో మరలా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. క సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read : మన హీరోలు కెరియర్ మొదట్లో ఈ హీరోయిన్స్ ను లవ్ చేశారా..? ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మలు…
సుఖీభవ అన్నారు దేవతలంతా ❤️
Hero @Kiran_Abbavaram’s better half #RahasyaGorak flaunts the sweetest baby bump! #KiranRahasya #KiranAbbavaram #TeluguFilmNagar pic.twitter.com/aOlpSz82eN— Telugu FilmNagar (@telugufilmnagar) May 7, 2025