Shankar Dada MBBS: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మంచి ఎంటర్టైనర్ గా నిలిచినా చిత్రం శంకర్ దాదా MBBS..ఇంద్ర ,ఠాగూర్ మరియు అంజి వంటి వరుస సీరియస్ కంటెంట్ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయి వినోదభరిత చిత్రం చెయ్యడం అప్పట్లో ఒక్క ప్రయోగం అయితే, అది సెన్సషనల్ హిట్ గా నిలిచి టాలీవుడ్ ఆల్ టైం టాప్ 3 చిత్రాలలో ఒక్కటిగా నిలబడడం విశేషం..ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కామెడీ టైమింగ్ కి ఫిదా కానీ వారు అంటూ ఎవ్వరు ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఈ సినిమాలో చిరంజీవి తో పాటు ఆయన తమ్ముడిగా నటించిన ATM పాత్రకి కూడా మంచి పేరు వచ్చింది..ATM గా శ్రీకాంత్ నటనని ఇప్పటికి మనం మర్చిపోలేదు..ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ లో కూడా ATM గా శ్రీకాంత్ గారే నటించారు..ఇది ఇలా ఉండగా ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ ఈ సినిమా గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అదేమిటో ఇప్పుడు మనం చూద్దాము.

Also Read: Director Parasuram Apologises: క్షమాపణలు చెప్పిన పరశురామ్.. ఎందుకో తెలుసా ?
ఈ సినిమా గురించి యాంకర్ ప్రస్తావించినప్పుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ క్యారక్టర్ ని తొలుత పవన్ కళ్యాణ్ గారితో చేయిద్దాం అని చిరంజీవి గారు అనుకున్నారు అని..కానీ ఆ సమయం లో ఆయన వరుస సినిమాలకి కమిట్ అయ్యి బిజీ గా ఉండడం వల్ల చేయలేకపోయారు అని..ఇక ఎవరితో చేయించాలి అని చిరంజీవి గారు ఆలోచనలో ఉండగా ఒక్క రోజు నేను అన్నయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నువ్వు ఈ పాత్ర చేస్తావా అని అడుగగా, అది అదృష్టం లా భావించి చేశాను అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్..అన్నయ్య కి నాకు మధ్య ఉన్న సన్నిహిత్య సంబంధం వల్ల సినిమాలో మా పాత్రలు అలా అద్భుతంగా పండాయి అంటూ చెప్పుకొచ్చారు హీరో శ్రీకాంత్..మళ్ళీ అన్నయ్య తో కలిసి ఎప్పుడు నటించే ఛాన్స్ వస్తుందో అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్..అఖండ సినిమా ద్వారా విలన్ రోల్ తో మంచి క్రేజ్ ని సంపాదించిన శ్రీకాంత్ ఇప్పుడు వరుసగా క్రేజీ స్టార్ హీరో సినిమాల్లో విలన్ రోల్స్ కొట్టేస్తున్నాడు..ఇప్పుడు ఓల్టెస్ట్ గా ఆయన తమిళ హీరో విజయ్ సినిమాలో కూడా విలన్ రోల్ ఆఫర్ ని కొట్టేసాడు..ఈ సినిమాకి వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read: Samantha: ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన సమంత.. హాట్ ఫొటోలు వైరల్



