Chiranjeevi super hit movie remake: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే పేర్లలో చిరంజీవి పేరు ఒకటి. ఇండస్ట్రీలో తనకు సపోర్ట్ చేసే వారు ఎవరూ లేకపోయిన స్వశక్తితో ఒంటరి పోరాటం చేసి నిలిచి గెలిచి చూపించిన ఒకే ఒక్కడు చిరంజీవి… అలాంటి చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేశాడు. తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ ఆయనకు ఎనలేని గుర్తింపుని తీసుకొచ్చాయి. ఆయన సినిమాలను రీమేక్ చేయాలని చాలామంది చేస్తున్నారు. ఆయన అన్ని సినిమాల్లో చాలా స్పెషల్ గా చెప్పుకునే సినిమా ‘చంటబ్బాయి’… అందులో చిరంజీవి ఒక కామిక్ టైమింగ్ ను ఫాలో అయ్యాడు. అది ప్రతి ఒక్కరికి నచ్చింది. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో ఆయన అంతకు ముందు ఎప్పుడూ చేయలేనంత ఈజ్ తో నటించాడు. ప్రతి డైలాగ్ ని ఎంజాయ్ చేస్తూ చెప్పాడు.
ఇక ఆ సినిమాని ఇప్పుడు రీమేక్ చేసే అవకాశం వస్తే ఎవరు చేస్తారు అనే విషయం చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి చంటబ్బాయి సినిమాని అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందని గతంలో చిరంజీవి కూడా చెప్పాడు.
అల్లు అర్జున్ కి సైతం చిరంజీవి సినిమాలన్నింటిలో చంటబ్బాయి సినిమా చాలా స్పెషల్ సినిమా అని పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ రేంజ్ సినిమాలను చేస్తున్నాడు. కాబట్టి చంటబ్బాయి సినిమా కంటెంట్ ను కూడా ఫ్యాన్ ఇండియాకి టచ్ అయ్యే విధంగా మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేస్తే బాగుంటుందని అభిమానులైతే భావిస్తున్నారు…ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…ఇక ఫ్యూచర్లో చంటబ్బాయి రీమేక్ లో అల్లు అర్జున్ చేసే అవకాశం ఉందని గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి అతను ఆ సినిమా చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…