Star Hero: ఒకప్పుడు యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో..మొదటి సినిమా తోనే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని తన ఖాతాలో వేసుకున్నాడు. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Superstar Mahesh Babu) లాంటి సూపర్ స్టార్స్ సినిమాలకు కూడా ఈ హీరోకి జరిగేంత బిజినెస్ జరిగేవి కాదు. అలా మొదటి రెండు సినిమాలతో సూపర్ హిట్స్ ని అందుకున్న ఈ హీరో, టాలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి లతో సినిమాలు చేసిన ఏకైక హీరో ఇతనే. అలా అంత మంది స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసినా ఇతను స్టార్ కాలేకపోయాడు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే వరుసగా నాలుగైదు డిజాస్టర్ సినిమాలను అందించడం ఇతని స్టైల్. కెరీర్ దాదాపుగా క్లోజ్ అయ్యింది,మళ్ళీ సూపర్ హిట్ తో కం బ్యాక్ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అభిమానులకు చేదువార్త..డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన
కానీ ఇప్పుడు వరుసగా ఆరు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కెరీర్ కొనసాగడం అతి కష్టంగా మారింది. దీంతో రెమ్యూనరేషన్ లేకుండానే సినిమాలు చేసేందుకు ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఆ హీరో మరెవరో కాదు ‘నితిన్'(Nithin). భీష్మ వంటి సూపర్ హిట్ తర్వాత ఈయన చేసిన రంగ్ దే, మాచెర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, అదే విధంగా రీసెంట్ గా విడుదలైన తమ్ముడు,ఇలా ప్రతీ చిత్రం ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యింది. వరుస ఫ్లాప్స్ లో ఉండడం తో దిల్ రాజు ‘తమ్ముడు’ చిత్రానికి కేవలం అడ్వాన్స్ మాత్రమే ఇవ్వగలను, సినిమా విడుదలై సూపర్ హిట్ అయితే లాభాల్లో వాటా ని ఇస్తాను అని నితిన్ తో అన్నాడట. అందుకు నితిన్ ఒప్పుకున్నాడు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం తో నితిన్ కి పూర్తి రెమ్యూనరేషన్ రానట్టే.
ఇప్పుడు నితిన్ తన తదుపరి చిత్రం ‘ఎల్లమ్మ’ ని దిల్ రాజు ప్రొడక్షన్ లోనే చేయబోతున్నాడు. ఇంకా షూటింగ్ ని మొదలు పెట్టుకోని ఈ సినిమాకు నితిన్ ఎలాంటి అడ్వాన్స్ ఇవ్వొద్దు అని దిల్ రాజు కి చెప్పాడట. సినిమా హిట్ అయ్యి లాభాలు వచ్చినప్పుడే తీసుకుంటానని అన్నాడట. కేవలం దిల్ రాజు కి మాత్రమే కాదు, తన మార్కెట్ మళ్ళీ పూర్తిగా కోలుకునే వరకు నితిన్ ఇదే విధంగా కొనసాగాలని అనుకుంటున్నట్టు సమాచారం. నితిన్ కచ్చితంగా స్టార్ హీరోల లిస్ట్ లో ఉండాల్సిన హీరో. కానీ కేవలం స్క్రిప్ట్ సెలక్షన్ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ని ఎదురుకోవాల్సి వచ్చింది. మొదటి నుండి నితిన్ కి ఇదే సమస్య. కనీసం ఎల్లమ్మ చిత్రం అయినా ఆయన కెరీర్ ని కాపాడుతుందో లేదో చూద్దాం.