Akhanda 2 Movie Release Date: నందమూరి అభిమానులు కోటి ఆశలు పెట్టుకోని ఎదురు చూస్తున్న చిత్రం ‘అఖండ 2′(Akhanda 2). వరుస ఫ్లాప్స్ లో ఉన్న బాలయ్య కెరీర్ రూపు రేఖలు మార్చిన చిత్రం ‘అఖండ’. ఈ సినిమా తో మొదలైన బాలయ్య(Nandamuri Balakrishna) జైత్ర యాత్ర ‘డాకు మహారాజ్’ వరకు కొనసాగింది. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ బాలయ్య కుర్ర వయస్సులో ఉన్నప్పుడు కూడా అందుకోలేదు అనేది వాస్తవం. నందమూరి అభిమానులకు వేరే లెవెల్ జోష్ ని నింపాడు బాలయ్య. బాలయ్య ని ఆ రేంజ్ లో నిలబెట్టిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ అంటే నందమూరి అభిమానుల్లోనే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా అంచనాలు భారీ గా పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని తీర్చి దిద్దుతున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆగష్టు నెలలో పూర్తి అవుతుందని అంటున్నారు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అభిమానులకు చేదువార్త..డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన!
అయితే బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన టీజర్ లో ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల చేయబోతున్నామని అధికారిక ప్రకటన చేశారు. అయితే ఆ తేదీన విడుదల చేయడం దాదాపుగా కష్టమే అని తెలుస్తుంది. షూటింగ్ పూర్తి అవ్వడానికి ఆగష్టు 2వ వారం అవుతుంది. దానికి తోడు గ్రాఫిక్స్ కంటెంట్ వర్క్ బోలెడంత బ్యాలన్స్ ఉంది. అవి పూర్తి అవ్వడానికి కనీసం రెండు నెలల సమయమైనా పడుతుంది. మరో పక్క ఇదే తేదీన విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం అమ్ముడుపోయాయి. కానీ ‘అఖండ 2’ కి ఇంకా ఓటీటీ బిజినెస్ కూడా పూర్తి అవ్వలేదు. దీంతో ఈ చిత్రం విడుదల అధికారికంగా వాయిదా పడినట్టే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. మేకర్స్ కూడా ఈ చిత్రం దసరా కి రావడం కష్టమే, డిసెంబర్ కి విడుదల చేస్తున్నామని ఎప్పుడో ఒక సమాచారం కూడా ఇచ్చేశారట.
కాబట్టి ఈ చిత్రం దసరా లో విడుదల లేకపోవడం దాదాపుగా ఖరారు అయినట్టే. డిసెంబర్ నెల మాత్రమే కాకుండా,వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ‘అఖండ’ చిత్రం డిసెంబర్ నెలలోనే విడుదలై సంచలనం సృష్టించింది. ‘పుష్ప’ చిత్రం కూడా అంతే, డిసెంబర్ నెలలోనే విడుదలై ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత పుష్ప 2 కూడా గత ఏడాది అదే డిసెంబర్ నెలలో విడుదలై ఎలాంటి చరిత్ర సృష్టించిందో మన కళ్లారా చూశాము. అఖండ 2 కి కూడా అదే హిస్టరీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశిస్తున్నారు. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విలన్ గా ఆది పిన్ని శెట్టి నటిస్తున్నాడు.