Star Hero: కెరియర్ ప్రారంభంలో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన ఇతడు ఆ తర్వాత హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలలో ఇతను కూడా ఒకరు. ఈ హీరో సినిమా థియేటర్లో వస్తుందంటే అభిమానులు థియేటర్ల దగ్గర జాతర చేస్తారు. ఈ హీరో కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు ఈ నటుడు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో విమానం నడిపే ఏకైక లైసెన్స్ ఉన్న హీరో ఇతను. చిన్నతనంలో ఆర్థిక సమస్యలతో ఒక బైకు గ్యారేజీలో కూడా పనిచేసేవాడు. బైక్, కారు రేసింగ్ మీద ఆసక్తి ఉండడంతో తన ఇంట్లో ఈ విషయాన్ని చెప్పాడు. కానీ ఆర్థిక కష్టాలు అడ్డుపడడంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాడు. అలా మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు.
అభిమానులు ఈ హీరోను తలా అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. ఈ హీరో మరెవరో కాదు సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరైన అజిత్. మే 1 హీరో అజిత్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులు, సినిమా తారలు అజిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్నప్పటి నుంచి అజిత్ కుమార్ కు ఆటోమొబైల్స్ అంటే చాలా ఇష్టం. చదువును మధ్యలో మానేసి అజిత్ కుమార్ ఒక బైక్ గ్యారేజీలో పనిచేసేవాడు. కెరియర్ ప్రారంభంలో అజిత్ కుమార్ ఒక ఆటోమొబైల్ కంపెనీలో పని చేసేవాడు. ఆ సమయంలోనే కారు రేసింగ్ పై ఆసక్తి ఉండడంతో 18 సంవత్సరాల వయసులో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పారట. అయితే అజిత్ తల్లిదండ్రులు తనకు కావాల్సింది తననే సాధించుకోమని చెప్పారట.
ఈ విషయాన్ని అజిత్ కుమార్ స్వయంగా గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే అప్పుడు రేసింగ్ జరుగుతున్న సమయంలో తన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి మోడలింగ్ రంగంలో ట్రై చేయమని చెప్పడంతో అటువైపు వెళ్లారట అజిత్ కుమార్. ఇక అప్పట్లో మోడలింగ్ లో వచ్చిన డబ్బును రేసింగ్ కోసం ఖర్చు చేసేవారట. అలాగే గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అజిత్ కుమార్ ను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణం అడిగినప్పుడు అజిత్ కుమార్ నా వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల పాలయ్యాను. అవి తీర్చడం కోసం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. రీసెంట్ గా అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకున్నారు.