Vishwambhara : విశ్వంభర సెట్స్ లో అనుకోని అతిథి .. చిరంజీవికి సర్ప్రైజ్ ఇచ్చిన ఆ స్టార్ హీరో

ఆ చిత్రంలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్స్ లో ఆమె ఒకరు. ఇలా అజిత్ తో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో అజిత్ స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Written By: NARESH, Updated On : May 30, 2024 7:19 am

Vishwambhara

Follow us on

Vishwambhara : విశ్వంభర సెట్స్ లో అనుకోని అతిథి ప్రత్యక్షం అయ్యాడు. ఆయన రాకతో చిరంజీవితో పాటు యూనిట్ సభ్యులు సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. ఆయనెవరో కాదు తమిళ స్టార్ హీరో అజిత్. ‘ గుడ్ బ్యాడ్ అగ్లీ ‘ టైటిల్ తో అజిత్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అలాగే మెగా స్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో ‘ విశ్వంభర ‘లో నటిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న ట్లు సమాచారం.

కాగా చిరంజీవిని కలిసేందుకు ‘ విశ్వంభర సెట్స్ కి అజిత్ వచ్చారు. అజిత్ నటిస్తున్న ‘ గుడ్ బ్యాడ్ అగ్లీ ‘ షూటింగ్ విశ్వంభర సెట్స్ పక్కనే జరుగుతుంది. దీంతో చిరుని కలిసి సర్ప్రైజ్ ఇచ్చారు అజిత్. ఈ క్రమంలో అజిత్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అజిత్ తో దిగిన లేటెస్ట్ ఫోటోలు ఆయన షేర్ చేశారు. ” నిన్న సాయంత్రం ‘ విశ్వంభర ‘ సెట్స్ కి స్టార్ గెస్ట్ గా వచ్చి అజిత్ కుమార్ మా అందరినీ ఆశ్చర్యపరిచారు.

అజిత్ సినిమా షూటింగ్ కూడా పక్కనే జరుగుతుండటంతో చాలా ఏళ్ల తర్వాత మేము కలిసే అదృష్టం దక్కింది. దీంతో అజిత్ తో అలనాటి జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసుకున్నాను. అజిత్ తొలి సినిమా ‘ ప్రేమ పుస్తకం ‘ ఆడియో లాంచ్ కార్యక్రమం నా చేతుల మీదుగా జరిగింది. అప్పటి సంగతులు ఒకసారి గుర్తు చేసుకున్నాం. అంతేకాకుండా అజిత్ సతీమణి షాలిని ‘ జగదేక వీరుడు అతిలోక సుందరి ‘ సినిమాలో నటించింది.

ఆ చిత్రంలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్స్ లో ఆమె ఒకరు. ఇలా అజిత్ తో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో అజిత్ స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఇప్పటికి అజిత్ ప్యూర్ హార్ట్ అలానే ఉంది…” అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అజిత్ – చిరు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.