Star Heores: ఈరోజుల్లో మంచి సినిమా రావడం ప్రేక్షకుల అదృష్టమే..! థియేటర్లు ఖాళీ లేకుండా వరుసగా మూవీస్ వస్తున్నా.. చాలా వరకు హిట్టు కొట్టినవి తక్కువే. కొన్ని సినిమాలు కంటెంట్ బాగా లేకున్నా హీరో, డైరెక్టర్ పేరు మీద నడుస్తున్నాయి. కానీ ఈ మధ్య కొందరు స్టార్ డైరెక్టర్లు సైతం నిరాశపరుస్తున్నారు. అయినా వారి డైరెక్షన్లో సినిమాలు చేయడానికి కొందరు హీరోలు ఉత్సాహంగా ఉన్నారు. కానీ వారిని స్టార్ హీరోలు ముందే లాక్ చేసేశారు. ఒకటి, రెండు ప్రాజెక్టులు వారికి అందించి డేట్స్ ఫిక్స్ చేశారు. దీంతో కొందరు డైరెక్టర్లు కనీసం సంవత్సరం వరకు బిజీగా ఉంటారు. త్రివిక్రమ్, కొరటాల శివ, హరీశ్ శంకర్, క్రిష్ లాంటి డైరెక్టర్లవి అయితే దాదాపు నాలుగేళ్ల వరకు డేట్స్ దొరికే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మిగతా కొందరు హీరోలు వారు ఎప్పుడు అవకాశం ఇస్తారా..? అని ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఈ డైరెక్టర్లను ఎవరు లాక్ చేశారు..? వారు ఏ సినిమాలతో బిజీగా మారారు..?
మహేశ్ బాబు (త్రివిక్రమ్)
మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ డైరెక్షన్లోనూ సత్తా చూపించాడు. ఆయన తీసిన సినిమాలు దాదాపు సక్సెస్ సాదించినవే. దీంతో ఆయనతో కలిసి పనిచేయడానికి కొందరు హీరోలు వెంటపడుతారు. కానీ ఆయన ఇప్పుడు బిజీగా మారారు. చివరిగా అల్లు అర్జున్ తో కలిసి ‘అలా వైకుంఠపురం’ సినమాను తీశారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’సినిమాను నేరుగా చేయకుండా పర్యవేక్షించారు. ఇప్పుడు మహేశ్ బాబు ఓ మూవీ మేకింగ్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యే సరికి కనీసం మరో సంవత్సరమైన పట్టుద్ది.

ఎన్టీఆర్ (కొరటాల శివ)
వరుస హిట్ల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ప్రస్తుతం #NTR30 సినిమాతో బిజీగా మారాడు. ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత ఎన్టీఆర్ మరో స్టార్ డైరెక్టర్ తో కలిసి పనిచేయడం విశేషం. కొరటాల శివ లాస్ట్ మూవీ ‘ఆచార్య’ చేసి ప్రేక్షకులను నిరాశ పరిచాడు. అయితే ఈసారి అలాంటి మిస్టేక్ కాకుండా జాగ్రత్తపడుతున్నాడు. అంతేకాకుండా #NTR30 మూవీని వచ్చే డిసెంబర్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేలా బిగ్ ప్లాన్ వేశాడు. కానీ అంతకంటే ముందే #AA 21ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొరటాల మరో ఆరు నెలల వరకు లాక్ అయిపోయాడు.

పవన్ కల్యాణ్ (క్రిష్)
విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ కూడా ఇప్పుడు బిజీ డైరెక్టరే. సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ అందించిన తరువాత క్రిశ్ భారీ ప్రాజెక్టులే చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ తో బిజీగా మారాడు. ఈ సినిమాను ప్రారంభించి చాలా రోజులే అవుతుంది. అయితే పవన్ బిజీగా మారడంతో గ్యాప్ లో ‘కొండపొలం’ ను తీసుకొచ్చాడు. ఆ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. దీంతో క్రిష్ ‘హరిహరవీరమల్లు’పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఈ మూవీ వచ్చే డిసెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత మరో రెండు హిందీ ప్రాజెక్టులు కూడా క్రిశ్ చేతిలో ఉన్నాయి. దీంతో ఇప్పట్లో క్రిష్ దొరికే అవకాశం లేదు.

పవన్ కల్యాణ్ (హరీశ్ శంకర్)
పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ మూవీతో పాపులర్ అయిన హరీశ్ శంకర్ ఆయనతో మూడో మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు ‘భవధీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ కూడా పెట్టారు. వచ్చే నెలలో ఈ మూవీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈయన చేతిలో మరో మూవీ యశోధ కూడా ఉంది. దీంతో హరీశ్ శంకర్ కొన్ని నెలల పాటు బిజీగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈయనను పవన్ కల్యాణ్ లాక్ చేసేశాడు.

ఈ నేపథ్యంలో మిగతా హీరోలు ఈ డైరెక్టల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు ఇటీవల త్రివిక్రమ్ రాసిన కథను ఇచ్చి వేరే డైరెక్టర్ తో సినిమా చేయాలన్నాడట. అయితే విజయ్ మాత్రం త్రివిక్రమ్ అయితేనే బెటర్ అని అంటున్నాడట. కానీ కొందరు స్టార్ డైరెక్టర్లను మాత్రం హీరోలు లాక్ చేసి వారిని బిజీగా మార్చారు.