Mahesh Babu: ఇండస్ట్రీ లో వారసత్వపు హీరోలు ఉన్నప్పటికి టాలెంట్ ఉన్నవాళ్ళకు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు…వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో మహేష్ బాబు ఒకరు…ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు సైతం ఆయన్ని పాన్ వరల్డ్ లోకి పరిచయం చేయబోతున్నాయి. ఇక ఇలాంటి మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతుండటం విశేషం… మహేష్ బాబు తో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు పోటీ పడతారు. కానీ కొంతమంది డైరెక్టర్స్ కి ఆ అదృష్టం వరిస్తే మరి కొంతమందికి ఆయనను డైరెక్ట్ చేసి అవకాశం రాలేదనే చెప్పాలి… ఇక ఈ కోవకు చెందిన వాళ్లను రాంగోపాల్ వర్మ మొదటి స్థానంలో ఉంటాడు. మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ లో రాంగోపాల్ వర్మ అతనితో సినిమా చేయాలని తీవ్రమైన ప్రయత్నం చేశాడు.
అయినప్పటికి అది వర్కౌట్ కాలేదు. కారణమేంటి అంటే మహేష్ బాబుకి నచ్చిన కథ రామ్ గోపాల్ వర్మ చెప్పలేదట… వర్మ ఎప్పుడు మాఫియా కథలను మాత్రమే చెప్పాడు. మొదట్లో మహేష్ బాబు ఫ్యామిలీ సబ్జెక్టులను చేయడానికి ఆసక్తి చూపించాడు. కాబట్టి ఆ సమయంలో వర్మ చెప్పిన కథలు నచ్చలేదు.
దాంతో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాలేదు… ఇక బోయపాటి శ్రీను సైతం కెరియర్ స్టార్టింగ్ నుంచి మహేష్ బాబు తో సినిమా చేయడానికి చాలా కసరత్తులు చేస్తూ వచ్చాడు. అయినప్పటికి ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఫైనల్ గా బోయపాటి శ్రీను ఇప్పటివరకు మహేష్ బాబు నైతే డైరెక్టు చేయలేదు. ఇకమీదట కూడా చేస్తాడనే గ్యారంటీ లేదు. ఎందుకంటే మహేష్ బాబు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాబట్టి మహేష్ బాబు ఇక ఆచితూచి సినిమాలు చేసే అవకాశం ఉంది.
బోయపాటి శ్రీను సినిమాలు మొత్తం యాక్షన్ తోనే ఉంటాయి. కాబట్టి ఆయన ఇకమీదట కూడా మహేష్ బాబు తో చేసే అవకాశం లేదు… ఇక అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు సినిమా కథని మొదట మహేష్ బాబు కి చెప్పారట. మహేష్ మాత్రం ఆ కథ మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు.