Telugu Cinema Directors: సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఎవ్వరి పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పడం చాలా కష్టం…ఈరోజు టాప్ పొజిషన్ లో ఉన్నవాళ్లు రేపు డీలా పడిపోవచ్చు. ఇవాళ ఫ్లాప్ డైరెక్టర్ గా ఉన్నవాళ్లు ఒక్క సక్సెస్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్ గా మారిపోవచ్చు. ఇక్కడ ఏది జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకులు చేసే సినిమాలతో పెద్దగా సక్సెస్ లను సాధించలేకపోవడంతో ఇతర దర్శకుల సినిమాలకి డైలాగ్ రైటర్స్ గా మారుతున్నారు. ప్రస్థానం లాంటి గొప్ప సినిమా చేసిన దేవకట్ట ఆ తర్వాత చేసిన సినిమాలతో పెద్దగా తన ఫామ్ ని అందుకోలేకపోయాడు. దాంతో ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాకి డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనే విషయం పక్కన పెడితే వారణాసి సినిమాతో ఒక కొత్త పంథాలో ముందుకు సాగుతున్నాడనే చెప్పాలి.
దేవకట్టా వారణాసి సినిమా చేసుకుంటూనే తను నెక్స్ట్ డైరెక్షన్ చేయబోయే సినిమా కోసం సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాకి సైతం దేవ కట్ట ను డైలాగ్ రైటర్ గా ఎంచుకున్నారట.
కారణం ఏంటి అంటే ఆ సినిమాలో కొన్ని అద్భుతమైన డైలాగులు కావాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో దేవకట్ట అయితేనే ఆ డైలాగులకు న్యాయం చేస్తారని అతని వల్లే ఆ సన్నివేశాలు బాగా ఎలివేట్ అవుతాయని అనుకుంటున్నారట. అందువల్లే దేవకట్ట కి ఆ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది… ఇక ‘జాతి రత్నాలు’ సినిమాతో దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ అనుదీప్ కేవీ…
ఆయన ప్రస్తుతం కరుణాకరన్ డైరెక్షన్లో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న ఒక సినిమాకి డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా అనుదీప్ విశ్వక్ సేన్ చేసిన ‘ఫంకీ’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన చాలా వరకు డీలా పడిపోయాడు… ఇక అందుకే ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది…