Homeఎంటర్టైన్మెంట్Kamal Haasan: కమల్ హాసన్ వెంట పడుతున్న స్టార్ డైరెక్టర్లు...

Kamal Haasan: కమల్ హాసన్ వెంట పడుతున్న స్టార్ డైరెక్టర్లు…

Kamal Haasan: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వైవిద్య భరితమైన పాత్రలను పోషించగలిగే నటుడు కమల్ హాసన్… అతన్ని మించిన నటుడు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. క్యారెక్టర్లలో షేడ్స్ ను సైతం చాలా పర్ఫెక్ట్ గా చూపిస్తాడు. అందుకే ఎవరైనా కొంచెం యాక్టింగ్ చేసినట్టుగా కనిపిస్తే చాలు కమల్ హాసన్ అంటూ అతన్ని కామెంట్ చేస్తుంటారు. అంటే కమలహాసన్ ఎలాంటి పాత్రలైన సరే ప్రాణం పెట్టి చేసి మెప్పించగలడు అనే ఒక పేరునైతే సంపాదించుకున్నాడు… ప్రస్తుతం ఆయన తో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…

లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో చేసిన ‘విక్రమ్’ సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చిన కమల్ హాసన్ ఆ సినిమా నుంచి వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక తనను యంగ్ డైరెక్టర్లు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూపించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక అలాగే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి సినిమాలో సైతం విలన్ గా నటించడం విశేషం…

ఇక ‘కల్కి 2’ సినిమాలో అతనికి ఫుల్ ఫ్లెడ్జెడ్ పాత్ర ఉండబోతుందట. ఇక ఏది ఏమైనా కూడా కమల్ హాసన్ జనరేషన్ లో ఉన్న యంగ్ డైరెక్టర్లు రాసుకునే పత్రాలకు బాగా సెట్ అవుతాడు. ఇప్పటికే తెలుగు నుంచి వివేక్ ఆత్రేయ, చందు మొండేటి లాంటి దర్శకులు సైతం కమల్ హాసన్ కి కథను కూడా వినిపించారట. ఇక అతను ఏ సినిమాలు చేయాలి అనే ఓ చిన్న డైలమాలో ఉన్నాడు.

ప్రస్తుతం ఆయన కమిటైన కొన్ని సినిమాలు పూర్తయిన తర్వాత ఈ యంగ్ డైరెక్టర్లకి అవకాశాలను ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు సైతం అతనికి రోజుకొక కథను వినిపిస్తున్నారట… మరి వీటన్నింటిలో ఆయన ఏ సినిమాని ముందు చేస్తాడు అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version