Senior Telugu Heroes: ప్రస్తుతం టైర్ వన్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక స్టేటస్ ను ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్లు పాన్ ఇండియా సినిమాలనే చేయాలి. లేకపోతే వాళ్ళ మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. దానికి తగ్గట్టుగానే దర్శకులను ఎంపిక చేసుకొని పాన్ ఇండియాలో గొప్ప విజయాలను సాధించగలిగే కథలతో వాళ్లు ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ప్రస్తుతం ప్రతి ఒక్క హీరో కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ లను ఎంచుకొని సినిమాలను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సీనియర్ హీరోలు మాత్రం కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమవుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ల నుంచి వచ్చే సినిమాలతో తెలుగులో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టైర్ వన్ హీరోలు సైతం పాన్ ఇండియా నేపథ్యంలో ముందుకు దూసుకెళ్తుంటే సీనియర్ హీరోలు మాత్రం తెలుగులోనే వాళ్ళ సత్తా చాటుతున్నారు.
ఇక ఇప్పటికే సీనియర్ హీరోలు, దర్శకులు సైతం వాళ్ళ మార్కెట్ ను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అనూప్ రావిపూడి, బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బాబీ, కొరటాల శివ లాంటి దర్శకులు సీనియర్ హీరోలకు అచ్చొచ్చిన దర్శకులుగా పేరు సంపాదించుకున్నారు.
వీళ్ళందరు వాళ్ళతో సినిమాలను చేసి సక్సెస్ లను సాధించి పెడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ – బాలయ్య బాబుకి భారీ సక్సెస్ లను అందించాలనే నేపథ్యంలో ముందుకు దూసుకెళ్తున్నాడు… ఈ దర్శకులే మార్చి మార్చి సీనియర్ హీరోలతో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఇక మీదట వాళ్ళు సీనియర్ హీరోలతో చేసే సినిమాలు భారీ విజయాలను సాధిస్తాయా? రాబోయే రోజుల్లో మన సీనియర్ హీరోల మార్కెట్ ను మరింత పెంచే ప్రయత్నం చేస్తారా..? వీలైతే వీళ్లను పాన్ ఇండియాలోకి ప్రవేశ పెట్టే ప్రయత్నం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మన టైర్ వన్ హీరోలే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. మన దర్శకులే టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు…
