Homeఎంటర్టైన్మెంట్Raj Tarun Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు: కోర్టు ఏం చేయబోతుంది? ఆమెకు భారీ...

Raj Tarun Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు: కోర్టు ఏం చేయబోతుంది? ఆమెకు భారీ షాక్ తప్పదా?

Raj Tarun Lavanya Case: హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య అయన మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ దాదాపు పదేళ్లు తనతో సహజీవనం చేశాడు. రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఒకటి రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడు. మరో యువతితో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్, తనను దూరం పెడుతున్నాడని.. లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

లావణ్య తన మాజీ ప్రేయసి అని ఒప్పుకున్న రాజ్ తరుణ్, ఆమెతో తన బంధం చాలా కాలం క్రితమే ముగిసింది అన్నాడు. లావణ్య డ్రగ్స్ కి అలవాటు పడింది. మానసికంగా నన్ను వేధించింది. చట్ట పరంగానే లావణ్యను ఎదుర్కొంటానని రాజ్ తరుణ్ మీడియాతో వెల్లడించాడు. లావణ్య కొన్ని ఆధారాలు పోలీసులకు సమర్పించింది.

ఈ కేసు విచారణలో ఉండగానే మరో కేసులో లావణ్య పేరు తెరపైకి వచ్చింది. మస్తాన్ సాయి అనే వ్యక్తి మీద ఆమె ఫిర్యాదు చేశారు. తన ప్రైవేట్ వీడియో మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి. వాటితో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని లావణ్య పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో లావణ్యకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేశాయి.

మస్తాన్ సాయి వద్ద పలువురు యువతుల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి ఉదంతం అనంతరం లావణ్య తీరులో మార్పు వచ్చింది. రాజ్ తరుణ్ విషయంలో తనదే తప్పు అన్నట్లు ఆమె మాట్లాడుతున్నారు. రాజ్ తరుణ్ పై పెట్టిన కేసు వాపసు తీసుకుంటానని అన్నారు.

అయితే ఒక్కసారి న్యాయస్థానం దృష్టికి వెళ్ళాక, కేసు వాపసు తీసుకోవడం అంత సులభం కాదని అంటున్నారు. ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం కూడా ముడిపడి ఉంది. కాబట్టి న్యాయస్థానం, ఇరువురి ఆరోపణలు, ఆధారాలు పరిశీలించి తీర్పు వెలువడించే అవకాశం ఉంది. రాజ్ తరుణ్ పై లావణ్య చేసింది తప్పుడు ఆరోపణలు అని తేలితే.. ఆమెకు శిక్ష తప్పదు.

మరోవైపు రాజ్ తరుణ్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. సోలో హీరోగా నటించిన చిత్రాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. ఆయన సపోర్టింగ్ పాత్రలు కూడా చేస్తున్నారు. నా సామిరంగ చిత్రంలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో రాజ్ తరుణ్ కనిపించారు.

RELATED ARTICLES

Most Popular