Director Ranjith : కాంట్రవర్సీ కామెంట్లు చేసి ఇబ్బందుల్లో ఇరుకున్న స్టార్ డైరెక్టర్ కథ…

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది చాలామంది నలిగిపోతుంటే కొంతమంది మాత్రం ఇక్కడ సక్సెస్ లతో వాళ్ల పేరు ప్రఖ్యాతలను పెంచుకుంటూ ఉంటారు ఇక ఇంకొందరు మాత్రం ఎప్పుడూ కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ ఇంటికి రాలేక అటు సక్సెస్ఫుల్ సినిమాలు చేయలేక సతమతమవుతూ ఉంటారు.

Written By: Gopi, Updated On : August 16, 2024 11:16 am

star director ranjith controversial comments

Follow us on

Director Ranjith : ప్రస్తుతం విక్రమ్ హీరోగా పా. రంజిత్ డైరెక్షన్ లో వచ్చిన తంగలాన్ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమాతో విక్రమ్ మరోసారి కంబ్యాక్ ఇచ్చాడు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుంటే, ఇక మరి కొంత మంది మాత్రం ఆ సినిమా స్టోరీ చిందర వందరగా ఉంది. అది సరైన ప్లాట్ మీద లేదు ఇక సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో సినిమాని తెరకెక్కించడంలో పా రంజిత్ ఫెయిల్ అయ్యాడు అంటూ కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు… ఇక నిజానికి సినిమా అనేది చదువులేకుండా కష్టపడి కూలీ పని చేసుకునేవాళ్ళకి, రిక్షా తొక్కే వారికి కూడా అర్థమయ్యే రీతిలో ఉన్నప్పుడే ఆ సినిమా సక్సెస్ సాధిస్తుంది. అలాగే భారీ వసూళ్లను కూడా రాబడుతుంది. అలా కాకుండా ప్రేక్షకుడి ఐక్యూ లెవెల్ కి టెస్ట్ పెడుతూ చేసే సినిమాలు ఒక కేటగిరి ప్రేక్షకులను మాత్రమే అలరిస్తాయి. అలాంటి సినిమాలు భారీ వసూళ్లను రాబట్టడంలో గాని బ్లాక్ బస్టర్లుగా నిలవడంలో గాని ఎప్పుడు వెనుకంజులోనే ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే పా రంజిత్ ఎంచుకున్న తంగలాన్ సినిమా పరిస్థితి కూడా అలాగే తయారైంది అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

ఇక ఇదిలా ఉంటే దర్శకుడు పా.రంజిత్ ప్రస్తుతం ఇక వివాదం లో ఇరుకున్నాడు. అది ఏంటి అంటే రీసెంట్ గా ఆయన అంటరానితనం గురించి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కూడా అంటరానితనం ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఈ సమాజం లో అంటరాని తనం అనేది రూపాంతరం చెందిందని చెబుతూనే టీ షాప్ వాడు టీ గ్లాసుల్లో ఇవ్వకుండా పేపర్ కప్స్ లలో ఇస్తున్నాడు. అది కూడా ఒక రకమైన అంటరానితనమే అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ఇక దానిమీద పలువురు సినీ సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ మాట్లాడడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి… నిజానికి పా. రంజిత్ లాంటి ఒక ఇంటలిజెంట్ డైరెక్టర్ ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే టీ ఇవ్వడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి గాజు గ్లాసులకు బదులు పేపర్ గ్లాస్ లకు ఎక్కువ ప్రియార్టి ఇస్తున్నారు. ఇక దాంతోపాటుగా ఈరోజుల్లో టీ కప్పులు కడగడానికి ఎవరూ పనిలోకి రావడం లేదు.

కాబట్టి ఆ టీ కొట్టు వ్యక్తే కప్పులను క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. వాడికి ఎక్కువగా టైమ్ ఉండడం లేదు. అందువల్ల సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉన్న వాడు పేపర్ కప్స్ లో టీ ఇస్తే ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి వాళ్లు టీ తాగేసి డస్ట్ బిన్ లో ఆ కప్స్ ని పడేయవచ్చు. దీని ద్వారా మరొక వ్యక్తిని పనిలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనే ఉద్దేశ్యం తోనే ఆ పేపర్ కప్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇక ఈ చిన్న లాజిక్ తెలియకుండా రంజిత్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి…