Star Director : ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. వరుస సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధిస్తూ తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రతి హీరో పాన్ ఇండియా జపం చేస్తున్న నేపథ్యం లో బాలయ్య బాబు లాంటి హీరో మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్లను సాధిస్తున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ సినిమా కోసం ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు (Balayya Babu)కొడుకు అయిన మోక్షజ్ఞ (Mokshagna) హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు గత కొన్ని సంవత్సరాల నుంచి వినిపిస్తున్నాయి. అయినప్పటికి ఇందులో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు. మరి మొత్తానికైతే ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడని చాలామంది చాలా రకాల వార్తలను వెలువరించినప్పటికీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మోక్షజ్ఞ తో సినిమా చేయడానికి మరొక దర్శకుడు పోటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే యంగ్ డైరెక్టర్లందరూ మోక్షజ్ఞ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సందర్భంలో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో కూడా మోక్షజ్ఞ నటించే అవకాశాలైతే ఉన్నాయట. మరి మొదటి సినిమా కోసం ఎవరిని ఎంచుకుంటున్నారు. ఎవరితో ఆయన మొదటి సినిమాను చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
Also Read : బాలీవుడ్ ఇండస్ట్రీ నాకు నచ్చడం లేదు అందుకే వదిలేస్తున్న అంటూ సంచలన కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్…
మొత్తానికైతే స్టార్ డైరెక్టర్లందరిని మోక్షజ్ఞ వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి తన స్టార్ డమ్ ను విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ప్రస్తుతం మొదటి సినిమా ఏ విధంగా ఉండబోతుంది ఆయనకు ఎలాంటి ఎంట్రీ లభిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక బాలయ్య బాబు ఈ విషయం మీదే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సరే ఈ సంవత్సరం సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి కనీసం వచ్చే సంవత్సరం వరకైనా ఆ సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నారట. మొత్తానికైతే మోక్షజ్ఞ ఎంట్రీ ఈ రెండు సంవత్సరాలలో ఉండబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
బాలయ్య ఎలాగైతే మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో మోక్షజ్ఞ ను కూడా మాస్ హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడట. అందుకే మొదటి సినిమా నుంచి మాస్ జపం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ప్రశాంత్ వర్మ తో తన మొదటి సినిమాను చేస్తాడా లేదంటే ఇతర దర్శకులు అతనితో సినిమా చేస్తారా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : ఈ స్టార్ డైరెక్టర్ తీసిన రెండు సినిమాలు మంచి విజయాలను సాధించాయి..అయిన 10 ఏళ్లలో 2 సినిమాలు మాత్రమే చేశాడా..?