OG Movie 9 Days Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం విడుదలై 9 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు పవన్ ఫ్యాన్స్ విడుదలకు ముందు నుండి ప్రతీ చిన్న అప్డేట్ ని ఏ రేంజ్ లో హైప్ చేస్తూ వచ్చారో మనమంతా చూస్తూనే ఉన్నాం. విడుదల తర్వాత కూడా అదే రేంజ్ జోరుని చూపిస్తూ వచ్చారు. మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని తీసుకొచ్చారు. రివ్యూయర్స్ ఇది కేవలం ఫ్యాన్స్ మాత్రమే చూడదగిన సినిమా, మామూలు ఆడియన్స్ కి నచ్చదు అని ఒక పక్కా చెప్పినా కూడా అభిమానులు వెనక్కి తగ్గలేదు. పాజిటివ్ టాక్ ని జనాల్లోకి బలంగా తీసుకొని వెళ్లడం లో సక్సెస్ అయ్యారు. అయితే ఈ చిత్రానికి దసరా తర్వాత ఊపు తగ్గుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ దసరా తర్వాత కూడా ఈ చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతోంది.
9 వ రోజున ఈ చిత్రం కేవలం నైజాం ప్రాంతం నుండి కోటి 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. దీంతో నైజాం ప్రాంతంలో ఈ సినిమా 50 కోట్ల షేర్ మార్కు ని అందుకుంది. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే మరో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. సోమవారం నుండి సినిమా డీసెంట్ స్థాయిలో కలెక్షన్స్ ని హోల్డ్ చేయగలిగితే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది. లేదంటే స్వల్ప నష్టాలను చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక సీడెడ్ లో ఈ చిత్రం 9 వ రోజున 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. నిన్నటితో ఈ చిత్రం సీడెడ్ ప్రాంతం లో 17 కోట్ల రూపాయిల షేర్ మార్కు ని అందుకుంది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు.
నేడు, రేపు కూడా భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉండడం తో, ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం చూస్తే ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. సోమవారం నుండి కలెక్షన్స్ హోల్డ్ చేయగలిగితే బ్రేక్ ఈవెన్ కూడా అవ్వొచ్చని అంటున్నారు. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను అందుకోవాల్సి ఉంటుంది. అదే ఉత్తరాంధ్ర ప్రాంతం లో 75 లక్షలు, కృష్ణా జిల్లాలో 17 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 22 లక్షలు,తూర్పు గోదావరి జిల్లాలో 17 లక్షలు, నెల్లూరు జిల్లాలో 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం 9 రోజుల్లో రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులకు గాను 121 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టగా, వరల్డ్ వైడ్ గా 168 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.