Star Actress: కేవలం ఈమె నటిగానే కాకుండా నిర్మాతగా అలాగే యాంకర్ గా కూడా తన టాలెంట్ గా మల్టీ టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న ఈ నటిని గుర్తుపట్టగలరా. ఈమె ఒక టాలీవుడ్ స్టార్ నటుడు గారాల పట్టి. తండ్రి అడుగుజాడల్లో తాను కూడా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కెరియర్ ప్రారంభంలో ఈమె అమెరికన్ టెలివిజన్లో పనిచేసేది. ఆ తర్వాత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట్లో విలన్ గా చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంది. నటిగా అలాగే నిర్మాతగా కూడా మారి తన సత్తా చూపించింది. వెండితెర తో పాటు బుల్లితెర మీద కూడా తన టాలెంట్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బుల్లితెర మీద ప్రసారం అయ్యే పలు టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసింది.
Also Read: కేవలం రూ.5 వేలతో ఇండియాకు వచ్చి ఎన్నో కష్టాలు.. ప్రస్తుతం 5 నిమిషాలకు 2 కోట్ల పారితోషకం..
కానీ ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలో కనిపించడం లేదు. తన నివాసాన్ని కూడా ఈ చిన్నది ముంబై కు మార్చేసిందని తెలుస్తుంది. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే హైదరాబాదులో కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ నటి సామాజిక సేవా కార్యక్రమాలతో వార్తల్లో ఉంటుంది. పేద విద్యార్థుల చదువు కోసం చాలా కృషి చేస్తుంది. ఈమె ఒక స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటుంది. ఆ స్కూల్లలో పేద విద్యార్థుల కోసం డిజిటల్ విద్య అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్ తదితర మౌలిక వసతులను అందిస్తుంది. ఈ నటి మరెవరో కాదు మంచు లక్ష్మి. ప్రస్తుతం మంచు లక్ష్మికి సంబంధించిన చిన్ననాటి ఫోటో సామాజిక మాధ్యమాలలో అందరిని ఆకట్టుకుంటుంది. గత కొన్ని రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో వివాదాలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఒకవైపు నుంచి మోహన్ బాబు, మంచు విష్ణు అలాగే మరోవైపు నుంచి మంచు మనోజ్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కానీ ఈ వివాదం పై మంచు లక్ష్మి ఇప్పటివరకు స్పందించలేదు. అతి త్వరలోనే ఈ గొడవలన్నీ సర్దుకుంటాయి అని మాత్రమే చెప్పుకొస్తుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి ముంబైలో తన కూతురితో కలిసి ఉంటుంది. ఈ మధ్యకాలంలో మంచు లక్ష్మి సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది. మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్ జి ఓ తో చేతులు కలిపి అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. ముఖ్యంగా సర్కారు బడులను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి వాటిలో పేద విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించే లాగా కృషి చేస్తుంది.
View this post on Instagram