https://oktelugu.com/

Kajal Agarwal: రూట్ మార్చిన కాజల్ … నిర్మాతగా కొత్త హీరోతో సినిమాకు ప్లాన్

Kajal Agarwal: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న భామ … కాజల్ అగర్వాల్. లక్ష్మి కళ్యాణం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ … ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఇటీవల పెళ్లి అయిన కూడా ఇంకా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుందంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్దం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా నిర్మాతగా మారింది కాజల్. కొత్త హీరోతో తన నిర్మాణ సంస్థలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 20, 2021 / 02:31 PM IST
    Follow us on

    Kajal Agarwal: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న భామ … కాజల్ అగర్వాల్. లక్ష్మి కళ్యాణం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ … ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఇటీవల పెళ్లి అయిన కూడా ఇంకా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుందంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్దం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా నిర్మాతగా మారింది కాజల్. కొత్త హీరోతో తన నిర్మాణ సంస్థలో మూవీ స్టార్ట్ చేసింది కాజల్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

    సౌత్ లోని అన్ని భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది కాజల్. గత సంవత్సరం ముంబైకి చెందిన బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు వరుసగా చేస్తూనే ఉంది. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు నిర్మాతలుగా మారుతున్నారు. ఇప్పుడు అదే కోవలో ఈ చందమామ కూడా చేరింది. కాజల్ ఒక పక్క సినిమాలు చేస్తూ, మరో పక్క భర్త బిజినెస్ ని కూడా చూస్తూ, ఇప్ప్పుడు నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించడం విశేషం.

    ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు హీరోగా రెండో సినిమా ప్రారంభమైంది. ఆ సినిమా పేరు ‘మను చరిత్ర’. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాని మరో నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించారు కాజల్. ఆపిల్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పేరుతో కాజల్ అగర్వాల్ ఈ సినిమాని సమర్పిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇందులో హీరోయిన్ గా మేఘ ఆకాష్ నటిస్తుండగా… ఇకపై భవిష్యత్తులో కూడా నిర్మాతగా మరిన్ని సినిమాలు నిర్మిస్తానని కాజల్ తెలిపింది.