Star Actress: సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క సినిమా హిట్ అయినా కూడా ఆ హీరోయిన్ల క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ వాళ్లు ఆ హిట్టు సాధించడం కోసం తమ కెరియర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలను అలాగే అడ్డంకులను ఎదుర్కొని ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే ఫిట్నెస్ మరియు లుక్స్ విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు. ఒకప్పుడు ఇలాగే విపరీతమైన అవమానాలను భరించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.
Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టూడెంట్ నెంబర్ వన్ హీరోయిన్…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..
సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. ఆ తర్వాత వచ్చిన స్టార్ డంను కాపాడుకోవాలన్నా కూడా అదే రేంజ్ లో కష్టపడాల్సి వస్తుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న సినిమా తారలు చాలామంది ఒకప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న వాళ్లే. కెరియర్ ప్రారంభంలో అడ్డంకులను ఛేదించి తమ సత్తా అనే నిరూపించుకొని స్టార్ గా ఎదగడం అంటే అంత సాధారణ పని కాదు. తాజాగా ఒక హీరోయిన్ అందంగా లేదని అలాగే లావుగా ఉన్నావంటూ ఆమెను ఏకంగా 13 సినిమాల నుంచి తిరస్కరించారట. ఆమె వికారంగా ఉందని కూడా ఆమెను అవమానించారట. అయినా కూడా ఈ హీరోయిన్ నటించిన సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేర్చుకుంది. గ్లామర్ పాత్రలు కాకుండా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ స్టార్డం సంపాదించుకుంది ఈ చిన్నది. ఈ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నటి విద్యాబాలన్. ఈమె బుల్లితెర నుంచి వెండి ధరకు పరిచయం అయింది. ఈమెకు సినిమా అవకాశాలు కూడా అంత ఈజీగా రాలేదు. కెరియర్ ప్రారంభంలో ఆమెను ఏకంగా 13 సినిమాల నుంచి తొలగించారు.
ఈ విషయం గురించి స్వయంగా విద్యాబాలన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విద్యాబాలన్ ఒక నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఆ నిర్మాత నన్ను అసభ్యంగా పిలిచాడు. అతడు నన్ను అలా అవమానించిన తర్వాత నేను ఆరు నెలలు అద్దంలో నా ముఖం కూడా చూసుకోలేదు అంటూ తెలిపింది. కానీ ఆ తర్వాత తన సహజ నటనతో విద్యాబాలన్ నటిగా మంచి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో ఆమెకు హిందీలో వరుసగా అవకాశాలు రావడంతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. మలయాళం లో కూడా ఈమె అవకాశాలు అందుకుంది. కానీ ఆ సినిమా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దాంతో విద్యాబాలన్ ను దురదృష్టవంతురాలిగా అభివర్ణించారు. ఎదుటి వ్యక్తులు మాట్లాడే మాటలు తనకు తనపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశాయని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. అలాగే ఒక సినిమా కోసం విద్యాబాలన్ బరువు పెరుగుతున్న సమయంలో కూడా ఆమెను బాడీ షేమింగు చేసేవారట. 2010లో విద్యాబాలన్ నటించిన కహాని సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. సిల్క్ స్మిత బయోగ్రఫీ ఆధారంగా చేసిన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడం జరిగింది.
View this post on Instagram