SSMB29 Glimpse: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన రాజమౌళి అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం ఆయన భారీ కసరత్తులను చేస్తూ ముందుకు దూసుకెళుతుండడం విశేషం… ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన ఆయన తొందరలోనే మూడో షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి ప్రయత్నం సక్సెస్ ఫుల్ గా నిలవడంతో అతని మీద ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పూర్తి కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఆయన ఒక సినిమా కోసం ఎన్ని రోజులు కేటాయించినా కూడా ఆ సినిమా యొక్క ఔట్పుట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండే విధంగా తీర్చిదిద్దుతూ ఉంటాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ప్రస్తుతం మహేష్ బాబు కోసం ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే మహేష్ బాబు సైతం సినిమా షూటింగ్లో పాల్గొనడానికి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారట. ఇప్పటివరకు మహేష్ బాబుకి డూప్ అనేది లేకుండా అతనితోనే స్వయంగా స్టంట్స్ చేయిస్తున్న రాజమౌళి ఈ మూడో షెడ్యూల్లో కూడా అదే రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: టాలీవుడ్ గుట్టు బయటపెట్టిన అల్లు అరవింద్…
ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఒక లాకెట్ కనిపించే విధంగానే ఆ ఫస్ట్ లుక్ హైలెట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేయడం మహేష్ బాబు అభిమానులను కొంతవరకు తీవ్రమైన నిరాశకు గురిచేసింది. ఎందుకంటే మహేష్ బాబు ఫేస్ కనబడకుండా అలా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా రిలీజ్ చేస్తారు అంటూ వాళ్ళు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.
మరి మొత్తానికైతే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ సైతం రిలీజ్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దసర రోజున ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: కూలీ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..పుష్ప 2 రికార్డ్స్ కూడా ఎగిరిపోయాయిగా!
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ వస్తే కనక సినిమా మీద అంచనాలు అమాంతం తార స్థాయికి వెళ్ళిపోతాయి అంటూ రాజమౌళితో పాటు అతని అభిమానులు కూడా చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. మరి దసర రోజున ఈ సినిమా నుంచి వచ్చే గ్లింప్స్ ఏ విధంగా ఉండబోతోంది. ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…