SS Thaman Twitter : సౌత్ ఇండియా లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో మనకి ప్రధానంగా వినిపించే పేర్లలో ఒకటి థమన్. స్టార్ హీరోల దగ్గర నుండి మీడియం రేంజ్ హీరోల వరకు థమన్(SS Thaman) మ్యూజిక్ అంటే చెవి కోసుకునే పరిస్థితి ఉంది. డైరెక్టర్ కోరుకున్న ఔట్పుట్ ని అతి తక్కువ సమయంలోనే అందించగల టాలెంట్ థమన్ లో ఉంటుంది. అందుకే అందరూ ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రోజులో 24 గంటలు ఉంటే, అందులో 18 గంటలు థమన్ పని చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు నిద్రపోతానో కూడా క్లారిటీ లేదంటూ ఒక ఇంటర్వ్యూ లో థమన్ చెప్పుకోవడం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. మరి ఇంత పని చేస్తున్నప్పుడు ఒక మనిషికి ఎదో ఒక అలవాటు ఉపశమనం ఇవ్వాలి. థమన్ కి అలా ఉపశమనం ఇచ్చే ఆట క్రికెట్.
ఈయనకు మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో,క్రికెట్ అంటే కూడా అంతే ఇష్టం. టాలీవుడ్ తరుపున ఇప్పటి వరకు ఎన్నో ఛారిటీ మ్యాచులు ఆడిన సందర్భాలు ఉన్నాయి. క్రికెట్ లో ఈయన సెంచరీలు కూడా చాలానే చేశాడు. ఈయన ఆడిన షాట్స్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే థమన్, అభిమానులతో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. కాసేపటి క్రితమే ఆయన తానూ ఆడుతున్న ఒక క్రికెట్ వీడియో ని అప్లోడ్ చేసి ‘డోంట్ బౌల్ షార్ట్ బ్రో’ అని అంటాడు. దీనికి ఒక అభిమాని ‘షార్ట్ కి స్లాట్ కి తేడా తేలినప్పుడే అర్థమైంది. నువ్వు ధోని ఫ్యాన్ అని’ అంటూ ఒక సెటైరికల్ రిప్లై ఇచ్చాడు. దీనికి థమన్ కోపగించుకుంటూ ‘ఓకే రా..వచ్చి నేర్చుకుంటాను..నీ అడ్రస్ పంపు బే’ అంటూ రిప్లై ఇచ్చాడు.
థమన్ మహేంద్ర సింగ్ ధోని కి వీరాభిమాని అనే సంగతి మన అందరికీ తెలిసిందే. అతనికి రిప్లై ఇచ్చిన అభిమాని ఒకే సమయంలో తన అభిమాన క్రికెటర్ ని తనని అవమానించాడు. అందుకే థమన్ ట్రిగ్గర్ అయ్యి ఈ రిప్లై ఇచ్చాడు. థమన్ కి ఇలాంటి రిప్లైలు ఇవ్వడం కొత్తేమి కాదు. గతం లో ఆయన మహేష్ బాబు ఫ్యాన్స్ పై నేరుగా సెటైర్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. అందరి సెలబ్రిటీలు లాగా థమన్ నెగటివిటీ ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లే రకం కాదు. తనపై ఎవరైనా నెగెటివ్ గా మాట్లాడితే ఇచ్చి పారేస్తాడు. ఇకపోతే ప్రస్తుతం థమన్ చేతిలో ‘అఖండ 2′,’ఓజీ’, ‘లెనిన్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలపై మార్కెట్ లో ఎలాంటి బజ్ ఉందో మన అందరికీ తెలిసిందే.
Ok Ra Vachiii nerchukunntaaa adresss pammpu bae ! https://t.co/B0M6AGbnO7
— thaman S (@MusicThaman) June 25, 2025