SS Rajamouli And Vijayendra Prasad: దర్శక దీరుడు రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించిన ఆయన ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో భారీ విజయాలను సాధించాడు. స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే రేంజ్ కి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వారణాసి సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మహేష్ బాబు లాంటి పాన్ ఇండియాలో కూడా సరైన మార్కెట్ లేని హీరోతో పాన్ వరల్డ్ లో సినిమా చేయడం అనేది పెద్ద సాహసం అనే చెప్పాలి. అది కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించడానికి రాజమౌళి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. తను విపరీతంగా కష్టపడుతూ చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకులందరి నుంచి ప్రశంసలను అందుకుంటుందా? లేదా అనే విషయంలో కూడా సరైన క్లారిటి రావాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే మాత్రం మరొక సంవత్సర కాలం పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…
ప్రతి సినిమాకి రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ కథలను అందిస్తుంటాడు. రీసెంట్ గా విజయేంద్ర ప్రసాద్ కి రాజమౌళికి మధ్య చిన్న గొడవలైతే వచ్చాయట. పర్సనల్ విషయాల్లో కాదు కానీ సినిమాకి సంబంధించిన కథ విషయంలోనే వీళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు.
ఇక ఆ క్రమంలోనే రీసెంట్ గా నెక్స్ట్ రాజమౌళి చేయబోయే సినిమాకు సంబంధించిన కథను విజయేంద్ర ప్రసాద్ ఫైనల్ చేసి పెట్టాడట. అందులో రాజమౌళి కొన్ని చేంజెస్ అయితే చెప్పాడట. కానీ విజయేంద్రప్రసాద్ కథపరంగా అలాంటి చేంజ్ చేస్తే కుదరదని రాజమౌళితో వాదించాడట. దాంతో వాళ్లిద్దరి మధ్య వాగ్వివాదం జరిగిందనే వార్తలైతే వస్తున్నాయి.
మొత్తానికైతే ఎవరు ఏది చేసినా కూడా సినిమా కథకి హెల్ప్ అయ్యే విధంగా బాగుంటుంది…ఇక ప్రతి సినిమా కథ విషయంలో వీళ్ళిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయట. ఈ విషయాన్ని గతంలో విజయేంద్రప్రసాద్ అలాగే రాజమౌళి ఇద్దరు చెప్పారు… ఇక వీళ్లిద్దరిలో ఇప్పుడు ఎవరు ఎవరిని కన్విన్స్ చేశారు. కథలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది…