Rajamouli and Magadheera : మన తెలుగు సినిమాకి నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి సినిమా ఏదైనా ఉందా అంటే, అది రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మగధీర’ అని చెప్పొచ్చు. అప్పటి వరకు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ ఇండస్ట్రీ లో దూసుకెళ్తున్న రాజమౌళి, చిరంజీవి కొడుకు తో సినిమా చేస్తున్నాడు అనే వార్త తెలియగానే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది. సినిమా ప్రారంభం నుండి షూటింగ్ ముగిసేవరకు ప్రేక్షకుల్లో ఈ చిత్రం ఏర్పాటు చేసిన అంచనాలు సాధారణమైనవి కావు. విడుదల తర్వాత ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వసూళ్ల వరకు ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పుతూ ఆరోజుల్లోనే 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. 50 రోజులు, వంద రోజుల సెంటర్స్ విషయం లో కూడా ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది.
అయితే ‘మగధీర’ ని చూసిన ప్రతీ ఒక్కరికి, ఇది కేవలం తెలుగు సినిమాకు మాత్రమే పరిమితం అవ్వాల్సిన సినిమా కాదు. ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేసుంటే సంచలనం సృష్టించేది అంటూ చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు #RRR మూవీ సమయంలో ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘మగధీర సమయంలో నేను నా నిర్మాత అల్లు అరవింద్ ని ఇతర భాషల్లో డబ్ చేయమని చాలా ఒత్తిడి చేశాను. సినిమా ఇతర భాషల్లో కూడా సక్సెస్ అవుతుంది నన్ను నమ్మండి అని బ్రతిమిలాడాను, కానీ కారణం ఏంటో తెలియదు కానీ ఆయన నో చెప్పాడు. నాకు చాలా బాధ కలిగింది. అప్పటి నుండి నేను ఇక నుండి నా సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తీయాలని అనుకున్నాను’ అంటూ చెప్పుకుకొచ్చాడు రాజమౌళి.
దానికి సంబంధించిన ఆడియో రికార్డ్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని చుట్టేస్తోంది. ఈ సినిమాని హిందీలో డబ్ చేసి థియేటర్స్ లో విడుదల చేయకపోయినా, టెలివిజన్ వెర్షన్ కోసం దబ్ చేసారు. సోనీ టీవీ లో టెలికాస్ట్ అయ్యినప్పుడు నార్త్ ఇండియా ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ కి మంచి గుర్తింపుని కూడా తెచ్చిపెట్టింది. టీవీ టెలికాస్ట్ లోనే ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే, ఇక సినిమాని తెలుగుతో పాటు హిందీ లో కూడా థియేటర్స్ లో విడుదల చేసుంటే, ఆరోజుల్లోనే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేదేమో. బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేశాడంటూ ఈ ఆడియో క్లిప్ ని విన్న రామ్ చరణ్ అభిమానులు బాధ పడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అప్పట్లో ఏ నిర్మాతకు కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలనీ ఉండేది కాదు. ఎందుకు మన హీరోలకు అక్కడ మార్కెట్ ఉండదు, డబ్బింగ్ చేసి డబ్బులు వేస్ట్ అనే మైండ్ సెట్ తో ఉండేవారు. అల్లు అరవింద్ ఆరోజుల్లో 40 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ఖర్చు చేయడమే పెద్ద రిస్క్. ఇంకో పెద్ద రిస్క్ కి ఆయన ఛాన్స్ తీసుకోలేదు. తీసుకొని ఉండుంటే ఇంకా లాభాలు చూసేవాడు.
SSR about #Magadheera PAN india release in 2009 to Hollywood Reporter Podcast :
“I begged , pressurized, everything i can do to release movie in other states but my producer said “NO”.
Glad we got more producers in TFI other than GA and SVC who couldn’t handle PAN india movies. pic.twitter.com/e2AdbyZQND
— Joker (@JokerSpeakz) February 6, 2025