Rajamouli and Mahesh babu : మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ పై అభిమానుల్లో ఎంత ఆనందం ఉందో, అంతే భయం కూడా ఉంది. ఎందుకంటే రాజమౌళి ఒక్కో సినిమాని పూర్తి చేయడానికి కనీసం మూడేళ్ళ సమయం తీసుకుంటాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆరు నెలలు, ఆ తర్వాత వర్క్ షాప్ కోసం మరో ఆరు నెలల సమయాన్ని తీసుకున్నాడు రాజమౌళి. అంటే సెట్స్ మీదకు వెళ్లే ముందు ఆయన ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేయడానికి ఏడాది సమయం తీసుకున్నాడు. ఎట్టకేలకు ఆ పనులన్నీ ముగించుకొని ఈ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోబోతుంది. ఈ చిత్రం పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకొచ్చేది 2027 వ సంవత్సరం లోనే. మధ్యలో ఏదైనా అడ్డంకులు ఏర్పడితే 2028 వ సంవత్సరంలో విడుదలైన ఆశ్చర్యపోనక్కర్లేదు. సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఈ చిత్రం కోసం కేటాయిస్తున్నాడట నిర్మాత కేఎస్ రామారావు.
అయితే ఈ సినిమా కేవలం ఒక్క పార్ట్ లో తెరకెక్కడం లేదు. మూడు భాగాలుగా తెరకెక్కుతుందట. ఒక్క భాగం పూర్తి చేయడానికే మూడేళ్ళ సమయం అంటే, మూడు భాగాలను పూర్తి చేయడానికి కనీసం ఆరేళ్ళ సమయం పడుతుంది. అంతకు మించి కూడా సమయం పట్టొచ్చు. అన్నేళ్లు మహేష్ బాబు కేవలం ఈ ఒక్క ప్రాజెక్ట్ మీదనే ఉండాలి. ఇదే అభిమానులను కాస్త భయపెడుతున్న విషయం. మహేష్ బాబు ఈ ఏడాదితో 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమా మూడు భాగాలు పూర్తి అయ్యేలోపు ఆయనకీ 56 ఏళ్ళు దాటిపోతాయి. ఇక ఆ తర్వాత కూడా మహేష్ బాబు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తాడా లేదా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంతే కాదు ఒకప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ మరొకరు లేరు. ఇప్పుడు రాజమౌళికి పోటీని ఇచ్చే డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు.
సందీప్ వంగ, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్, అట్లీ, నాగ అశ్విన్ వీళ్లంతా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి తో సమానమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఒకప్పుడు రాజమౌళి కి ఉన్న క్రేజ్ ఈసారి ఉండకపోవచ్చు. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత మహేష్ బాబు వెంటనే మరో క్రేజీ పాన్ ఇండియన్ సినిమా చేసే అవకాశం ఉంటుందో లేదో చెప్పలేం. ఎందుకంటే పైన చెప్పిన డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో వరుసగా సినిమాలు సెట్ చేసుకున్నారు. వాళ్ళు కమిట్ అయిన ఈ సినిమాలు పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చేలోపు 9 ఏళ్ళు పట్టొచ్చు. దీంతో రాజమౌళి సినిమా పూర్తి అయ్యాక మహేష్ మళ్ళీ కమర్షియల్ సినిమాలు చేస్తాడా?, రాజమౌళి తో చేసే సినిమానే చివరి పాన్ ఇండియన్ చిత్రం అవుతుందా అనే భయంలో ఉన్నారు ఫ్యాన్స్.