SS Rajamouli RRR Movie: భారీ అంచనాలున్న చిత్రాలకు ముందస్తు క్రేజ్, కాన్ఫిడెన్స్ విడుదల వరకూ కొనసాగడం చాలా అవసరం. ఈ రెండిటిలో ఆర్ఆర్ఆర్ డిస్టింక్షన్ మార్కులు సాధించి, ఇక విడుదల తర్వాత బ్లాక్‌బస్టర్ మాట వినడమే తరువాయిగా మిగిలింది. ఇటీవల ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ చూసిన ప్రేక్షకులు తిరిగి రెండోసారి చూడడం ఖాయమని తెలిపారు.

కరోనా వల్ల వచ్చిన బ్రేక్‌ని సద్వినియోగం చేసుకొని చిత్రాన్ని పకడ్బందీగా తీశామన్నారు. ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు నాలుగేళ్లుగా ఎదురుచూస్తోన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ నెల 25న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులకు రాజమౌళి ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు.
మార్చి 25 నుంచి 3డీలో ప్రదర్శించేందుకు అనుకూలంగా ఉన్న థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ను 3డీలో అనుభూతి చెందవచ్చని రాజమౌళి తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రచార కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్’ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి సపోర్ట్ చేశారని తెలిపారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి టికెట్ ధరలు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ ఆంధ్రలో కూడా ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా ఉన్నాయి. ఇక ప్రేక్షకులు ఆశిస్తున్నట్లు బెన్ఫిట్ షోలు తప్పకుండా ఉంటాయని రాజమౌళి స్పష్టం చేశారు. అలాగే తెలుగు చలన చిత్ర తలమానికం RRR విడుదలకు అంతా సిద్ధమైంది.

కాగా ఆర్ఆర్ఆర్ మూవీపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు